Actress Anuja: అలనాటి స్టార్ కమెడియన్ అనూజ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే.. లేటేస్ట్ లుక్ వైరల్..
ఒక్క సినిమాతో క్లిక్ అయి ఆ తర్వాత వందలాది చిత్రాల్లో నటించిన నటీనటులు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అప్పట్లో తక్కువ సమయంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై కనిపించి కనుమరుగయ్యారు. తమదై నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన నటీనటులు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అందులో అనూజ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.
సినీ పరిశ్రమ ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని ఎంతో మంది కలలు కంటారు. ప్రతిభతోపాటు కాస్త అదృష్టం కూడా కలిస్తే ఇండస్ట్రీలో స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కానీ వచ్చిన గుర్తింపును ఎక్కువ కాలం నిలబెట్టుకోవడమే అసలైన సవాలు. ఒక్క సినిమాతో క్లిక్ అయి ఆ తర్వాత వందలాది చిత్రాల్లో నటించిన నటీనటులు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అప్పట్లో తక్కువ సమయంలోనే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని వెండితెరపై కనిపించి కనుమరుగయ్యారు. తమదై నటనతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించిన నటీనటులు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అందులో అనూజ ఒకరు. ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు.
అనూజ ఒకప్పుడు లేడీ కమెడియన్గా ఎన్నో చిత్రాల్లో నటించింది. తెలుగమ్మాయి అయినప్పటికీ మలయాళం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయమైంది. దక్షిణాదిలో అనేక చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్ గా నటించింది. 1980లో కథానాయికగా, లేడీ కమెడియన్ గా, సహాయ నటిగా దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. బ్రహ్మానందం, అనూజ కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్లకు అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. చంటి, పెళ్లి చేసుకుందాం సినిమాల్లో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించారు. 2004 వరకు సినిమాల్లో యాక్టివ్ గా ఉన్నారు.
కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే ప్రేమ వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయారు అనూజ. చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతున్నారు. నిత్యం తన ఇన్ స్టా ఖాతాలో ఏదోక పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనూజ లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.