- Telugu News Photo Gallery Cinema photos Kalki 2898 AD box office collection crosses Rs 700 crore mark worldwide and becomes 2nd highest Hindi grosser of 2024
Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లకు చేరువలో కల్కి.. ఏడు రోజుల్లో ఎంత రాట్టిందంటే..
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి... ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే విజువల్ ఎఫెక్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమా గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ చేసిన కల్కి తాజాగా మరో మైలురాయిని దాటింది.
Updated on: Jul 04, 2024 | 12:23 PM

డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి... ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కల్కి సినిమాలో రియల్ లొకేషన్స్ కంటే విజువల్ ఎఫెక్ట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఈ సినిమా గత వారం రోజులుగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 500 కోట్ల మార్క్ చేసిన కల్కి తాజాగా మరో మైలురాయిని దాటింది.

ఇప్పటికే పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తోన్న కల్కి ఇప్పటివరకు రూ.700 కోట్లకు పైగ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. హీరో లేకుండా కేవలం దీపికా పదుకొణె పాత్రకు సంబంధించిన లుక్ హైలెట్ చేయడం విశేషం.

ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ రూ.1000 కోట్ల క్లబ్ లో చేరడమే తరువాయి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే రూ.95.3 కోట్ల నెట్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ట్రాకర్ సక్నిల్క్ ప్రకారం ఇండియాలో కల్కి రూ.393.4 కోట్లకు పైగా వసూలు చేసింది.

భారీ పాన్ ఇండియా మూవీస్ తో వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ షేక్ చేయగల స్టామినా ప్రభాస్ కే సొంతమని చెప్పేందుకు కల్కి లేటెస్ట్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.

భారత దేశంలో కల్కి తెలుగు వెర్షన్ మొదటి వారంలో రూ.202.8 కోట్లు, హిందీ వెర్షన్ రూ.152.5 కోట్లు వసూలు చేసింది. హిందీ మార్కె్ట్లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి నిలిచింది. బాలీవుడ్ హంగామా ప్రకారం రూ.199.45 కోట్లతో ఫైటర్ మొదటి స్థానంలో ఉండగా.. రూ.149.49 కోట్లతో రెండవ స్థానంలో కల్కి ఉంది.