Actress : తెలుగులో క్రేజీ హీరోయిన్.. సామాన్య వ్యక్తిని పెళ్లి చేసుకుని.. సినిమాలు వదిలేసి ఇప్పుడు ఇలా..

ఒకప్పుడు సినీరంగాన్ని ఏలింది. ఆమె నటించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అయ్యాయి. అయినప్పటికీ అవకాశాలు మాత్రం తగ్గలేదు. తెలుగు, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత అనుహ్యంగా సినిమా ప్రపంచం నుంచి తప్పుకుంది. సెలబ్రెటీని కాకుండా సామాన్య వ్యక్తిని పెళ్లి చేసుకుని గ్లామర్ ప్రపంచానికి దూరమైంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా.. ?

Actress : తెలుగులో క్రేజీ హీరోయిన్.. సామాన్య వ్యక్తిని పెళ్లి చేసుకుని.. సినిమాలు వదిలేసి ఇప్పుడు ఇలా..
Tulip Joshi

Updated on: Aug 23, 2025 | 10:35 AM

ఇండస్ట్రీలో ఆమె ఒకప్పుడు తోపు హీరోయిన్.. కానీ సామాన్యుడిని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యింది. తన యాక్టింగ్ వృత్తిని వదిలేసి ఫ్యామిలీకి టైమ్ కేటాయించింది. ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ తులిప్ జోషి. సెప్టెంబర్ 1972లో ముంబైలో జన్మించిన తులిప్ జోషి తండ్రి గుజరాతీ మూలానికి చెందినవారు. 2000లో ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొంది. ఆ తర్వాత మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టి ఎన్నో ప్రకటనలలో కనిపించింది. 2002లో యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘మేరే యార్ కి షాదీ హై’ చిత్రంతో బాలీవుడ్‌లో నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.

ఇవి కూడా చదవండి : Cinema : రెండు గంటల సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ.. దెబ్బకు దద్దరిల్లిన బాక్సాఫీస్.. ఎక్కడ చూడొచ్చంటే..

దీంతో ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి. హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు సినిమాల్లో కనిపించింది. ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. తెలుగు, కన్నడ, పంజాబీ, మలయాళం చిత్రాల్లో నటించిన ఆమె.. చివరగా జై హో చిత్రంలో నటించింది. 2014లో విడుదలైన ఈ సినమా భారీ విజయాన్ని అందుకుంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. తులిప్ జోషి కెప్టెన్ వినోద్ నాయర్‌ను వివాహం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

Cinema: రూ.70 లక్షల బడ్జెట్.. 70 కోట్ల కలెక్షన్స్.. 460 రోజులు థియేటర్లలో రచ్చ చేసిన సినిమా..

నాయర్ 1989 నుండి 1996 వరకు పంజాబ్ రెజిమెంట్‌లోని 19వ బెటాలియన్‌లో పనిచేశారు. అతడు భారత సైన్యంలో కమిషన్డ్ ఆఫీసర్ గా వర్క్ చేశారు. అంతేకాదు..అతడు ‘ప్రైడ్ ఆఫ్ లయన్స్’ అనే నవలను రాశారు. తులిప్ జోషి గత 10 సంవత్సరాలుగా సినిమా ప్రపంచానికి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం వ్యాపారరంగంలో బిజీగా ఉంటున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి : Cinema : 26 రోజుల్లోనే 280 కోట్ల కలెక్షన్స్.. రికార్డ్ సృష్టించిన తొలి యానిమేటెడ్ సినిమా ఇది..

ఇవి కూడా చదవండి : Actress : ఒకప్పుడు తోపు హీరోయిన్.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. రూ.2000 కోట్ల ఆస్తులు.. ఎవరంటే..