
పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో ఆమె తోపు హీరోయిన్. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో ఆమె చేసింది తక్కువ సినిమాలే అయినా… సహజ నటనతో కట్టిపడేసింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో రాణించిన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలం తర్వాత ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేసింది. వయసు పెరిగినా ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీగా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : Cinema : ఇదెందయ్య ఇది.. ఓటీటీలో దూసుకుపోతుంది.. అయినా థియేటర్లలో కలెక్షన్స్ ఆగడం లేదు..
ఆ హీరోయిన్ పేరు కనిహ. ఈ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. అసలు పేరు దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. 2002లో దర్శకుడు మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ నిర్మించిన ఫైవ్ స్టార్ అనే సినిమాతో తమిళ సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2003లో తెలుగులో శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలో అందం, అమాయకత్వం.. అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత రవితేజ నటించిన నా ఆటోగ్రాఫర్ స్వీట్ మెమోరీస్ చిత్రంలో నటించింది.
ఇవి కూడా చదవండి : Actors: ఇద్దరు అన్నదమ్ములు తెలుగులో క్రేజీ హీరోస్.. ఒకరు పాన్ ఇండియా.. మరొకరు టాలీవుడ్..
ఈ రెండు సినిమాల తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు. కానీ తమిళం, మలయాళంలో కలిపి మొత్తం 20చిత్రాల్లో నటించింది. వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్న సమయంలోనే ఆమె సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Tollywood: అప్పుడు క్యాటరింగ్ బాయ్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.90 కోట్లు.. క్రేజ్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ సినిమాతో కుర్రాళ్ల హృదయాలు దొచుకున్న చిన్నది.. ఈ హీరోయిన్ గురించి తెలుసా.. ?