చేసింది రెండు సినిమాలు.. ఒకటి బ్లాక్ బస్టర్.. ఒకటి డిజాస్టర్.. కానీ క్రేజ్ మాత్రం ఫుల్
సినిమాల్లో అవకాశం రావడమే గొప్పగా భావిస్తుంటారు కొందరు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ.. తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. సినిమాల్లో ఆమె చేసే పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారింది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారుతున్నారు. కొంతమంది భామలు స్టార్ డమ్ కోసం ఇంకా ఎదురుచూస్తుంటే.. మరో వైపు యంగ్ బ్యూటీలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పాన్ ఇండియా ఆఫర్స్ కూడా అందుకుంటున్నారు. అలాగే కొంతమంది భామలు ఒకటి రెండు సినిమాలతోనే ఫుల్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంటున్నారు. ఇక పైన కనిపిస్తున్న అమ్మడు కూడా అంతే చేసింది రెండు సినిమాలే అందులో ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ రెండోది డిజాస్టర్.. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగా ఉంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తన అందంతో పాటు అభినయంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఆ కుర్రాది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పై ఫొటోలో వయ్యారంగా నిలబడ్డ ఆ చిన్నది ఎవరో కాదు సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన క్రేజీ బ్యూటీ వైష్ణవి చైతన్య. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది.
ముఖ్యంగా అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించింది. అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది. యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో ఆకట్టుకుంది. బేబీ సినిమా తర్వాత లవ్ మీ అనే సినిమా చేసింది. ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న జాక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది.
View this post on Instagram




