Tollywood: తస్సాదియ్యా.. 40 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం.. ఈ బ్యూటీని చూస్తే మెంటలెక్కాల్సిందే..
తెలుగు సినీ పరిశ్రమలో ఒకటి రెండు చిత్రాలతో ఫేమస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకోవాల్సిన ముద్దుగుమ్మలు.. ఉన్నట్లుండి ఇండస్ట్రీకి దూరమయ్యారు. అందులో ఈ బ్యూటీ ఒకరు. ఇంతకీ ఆ హీరోయిన్ మీకు గుర్తుందా..?

పైన ఫోటోల్ రవితేజతో కలిసి కనిపిస్తున్న ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన చంటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 2004లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా.. ఛార్మీ, డైసీ బోపన్న హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా డిజాస్టర్ కావడంతో డైసీ బోపన్నకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ అందం, అభినయంతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత ‘బింబ’, ‘భగవాన్’, ‘గరమ్ మసాలా’, ‘జాక్‌పాట్’, ‘తవారిన సిరి’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో కేవలం మూడు సినిమాల్లోనే నటించింది.
కానీ ఎక్కువగా 12 సినిమాల్లో నటించింది. స్టార్ హీరోలు గణేష్, శివరాజ్ కుమార్, ఉపేంద్ర, దర్శన్ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. ఈ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరమయ్యింది. కానీ 12 ఏళ్ల తర్వాత ఇటీవలే ఓ వెబ్ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది.
2011లో అమిత్ జాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది డైసీ బోపన్న. ఆ తర్వాత సినిమాలకు దూరమయ్యింది. 2012లో కన్నడలో వచ్చిన క్రేజీ లోక సినిమాలో చివరిసారిగా కనిపించింది. 12 ఏళ్ల తర్వాత 2024 రష్ అనే ఓటీటీ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో రవిబాబు హీరోగా నటించగా.. ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఇప్పుడు డైసీ బోపన్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




