
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్. చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లోకి అడుగుపెట్టి ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. ఎన్నో సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. అయినప్పటికీ యంగ్ హీరోల సినిమాల్లో నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అయితే కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆ తర్వాత రాజకీయాల్లో చేరింది. అదే సమయంలో అటు లాయర్ కోర్సు పూర్తి చేసింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ రేష్మ రాథోడ్.
రేష్మ రాథోడ్.. ఈ పేరు అంతగా గుర్తుకు ఉండకపోవచ్చు. కానీ ఈరోజుల్లో సినిమా బ్యూటీ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. రేష్మ రాథోడ్.. అచ్చ తెలుగమ్మాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆమె వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2012లో బాడీగార్డ్ సినిమాలో త్రిష స్నేహితురాలిగా కనిపించింది. ఆ తర్వాత డైరెక్టర్ మారుతి రూపొందించిన ఈరోజుల్లో సినిమాలో మెయిన్ లీడ్ రోల్ పోషించింది.
ఇవి కూడా చదవండి : బాబోయ్.. ఈ ఆసనాలేంటమ్మా.. తలకిందులుగా వేలాడుతున్న హీరోయిన్.. ఒకప్పుడు తెలుగులో తోపు..
ఫస్ట్ మూవీతోనే గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ సరసన జై శ్రీరామ్ మూవీలో కనిపించింది. ఆ త్రవాత తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నటించింది. 2017 తర్వాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు సుప్రీం కోర్టులో లాయర్ గా విధులు నిర్వహిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Telugu Actress : వరుసగా ప్లాపులు.. అయినా తగ్గని క్రేజ్.. రెమ్యునరేషన్ డబుల్ చేసిన హీరోయిన్..