Tollywood: వాటే మేకోవర్ భయ్యా.. చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ ..
అప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ సునామి. ఒకప్పుడు బాలనటిగా ఎన్నో సినిమాల్లో కనిపించి అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఇప్పుడు నెట్టింట మోడ్రన్ డ్రెస్సులతో మతిపోగొట్టేస్తుంది. ఇంతకీ ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్ అయిపోయింది.

తెలుగు సినీరంగంలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన చిన్నారులు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సత్తా చాటుతున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో బాలనటులుగా కనిపించి.. ఇప్పుడు వెండితెరపై సత్తా చాటుతున్నారు. పైన కనిపిస్తున్న ఫోటోను చూశారు కదా.. అందులో చిరంజీవి, రమ్యకృష్ణ మధ్యలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా.. ? తెలుగు ప్రేక్షకులకు చాలా ఇష్టమైన చైల్డ్ ఆర్టిస్ట్. దేవుళ్లు సినిమాలో బాలనటిగా కనిపించింది. ఈ మూవీలో అమాయకమైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత చిరంజీవి నటించిన అంజి చిత్రంలో కనిపించింది. అలాగే తెలుగులో అనేక సినిమాల్లో మెరిసిన ఈ అమ్మడు.. ఇప్పుడు నెట్టింట అందాలతో కవ్విస్తుంది. ఆ చిన్నారి పేరు నిత్యా శెట్టి.. చాలాకాలం పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది.
కొన్నాళ్లు చదువుల కోసం గ్యాప్ తీసుకున్న ఈ చిన్నారి.. ఇటీవలే పిట్టకథ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్ నిహారిక నిర్మించిన హాల్లో వరల్డ్ వెబ్ సిరీస్ సైతం చేసింది. అయితే ఈ రెండు చిత్రాలు నిత్యాకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం తెలుగు సినీరంగంలో అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది నిత్యా. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అందాల అరాచకం సృష్టిస్తుంది. తెలుగులో హీరోయిన్ గా సరైన అవకాశాలు, బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది నిత్యా. తాజాగా ఈ అమ్మడు లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్లకే టెన్షన్ పుట్టించేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
