AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Taj Mahal: శ్రీకాంత్ తాజ్ మహల్ హీరోయిన్ మోనిక బేడి గుర్తున్నారా ?.. ఇప్పుడేం చేస్తున్నారంటే..

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ జోడిగా మోనికా బేడి నటించగా.. శ్రీహరి, సంఘవి, కోట శ్రీనివాస్ రావు, నూతన్ ప్రసాద్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

Taj Mahal: శ్రీకాంత్ తాజ్ మహల్ హీరోయిన్ మోనిక బేడి గుర్తున్నారా ?.. ఇప్పుడేం చేస్తున్నారంటే..
Taj Mahal
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2023 | 11:04 AM

Share

అందం… అంతకు మించిన సహజ నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దొచుకుని.. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయిన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు చిత్రపరిశ్రమలో తొలి సినిమాతోనే హిట్ అందుకుని.. ఆ తర్వాత ఒకటి.. రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుంటారు. కానీ ఇప్పటికీ ఆ ముద్దుగుమ్మలకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారిలో మోనికా బేడి ఒకరు. 1995లో ముప్పలనేని శివ దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన చిత్రం తాజ్ మహల్. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు నిర్మించారు. ఇందులో శ్రీకాంత్ జోడిగా మోనికా బేడి నటించగా.. శ్రీహరి, సంఘవి, కోట శ్రీనివాస్ రావు, నూతన్ ప్రసాద్ తదితరులు కీలకపాత్రలలో నటించారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

అంతేకాకుండా ఈ చిత్రంలోని ప్రతి సాంగ్ ఇప్పటికీ శ్రోతల ఆల్ టైమ్ ఫేవరేట్. మంచు కొండల్లోన చంద్రమా.. సాగిపోయే నీలి మేఘం వంటి సాంగ్స్ ఇప్పటికీ యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటాయి. అయితే ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమయ్యింది మోనికా బేడి. 1975 జనవరి 18న పంజాబ్ లో జన్మించిన ఆమె… మెయిన్ తేర ఆషికీ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 1995లో తాజ్ మహల్ చిత్రంతో తెలుగు తెరపై సందడి చేసింది. మొదటి సినిమాతోనే నటనపరంగా ప్రశంసలు అందుకుంది మోనికా.. ఆ తర్వాత… సర్కస్ సత్తిపండు, శివయ్య, చూడాలని ఉంది, స్పీడ్ డ్యాన్సర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇవి కూడా చదవండి

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే అనుకోకుండా ఇండస్ట్రీకి దూరమైంది. 2007లో అబ్దుల్ సాలీమ్ తో ప్రేమలో పడింది. ఆ తర్వాత 2010లో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం మోనికా బేడి తన తల్లిదండ్రులతో కలిసి ముంబైలో నివసిస్తుంది. సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

View this post on Instagram

A post shared by Monica Bedi (@memonicabedi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.