Tholi Prema: పవన్ కల్యాణ్ తొలి ప్రేమకు 26 ఏళ్లు.. హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?

|

Jul 27, 2024 | 6:02 PM

కరుణా కరన్ తెరకెక్కించిన తొలి ప్రేమ సినిమా 1998 జులై 24న రిలీజైంది. అంటే ఈ సినిమా రిలీజై సుమారు 26 ఏళ్లు గడిచాయి.. అంతకు ముందు కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే గుర్తింపు ఉన్న పవన్ కల్యాణ్ కు తొలి ప్రేమ సినిమా మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అదే సమయంలో ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలో హీరోయిన్‌గా నటించిన కీర్తి రెడ్డి కూడా ఓవర్ నైట్ ఫేమ్ సొంతం చేసుకుంది.

Tholi Prema: పవన్ కల్యాణ్ తొలి ప్రేమకు 26 ఏళ్లు.. హీరోయిన్ కీర్తి రెడ్డి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా?
Tholi Prema Movie
Follow us on

 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ సినిమాలు ఉండచ్చు గాక .. కానీ తొలి ప్రేమ సినిమా మాత్రం చాలా స్పెషల్. ప్రేమ కథా చిత్రాల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచినా ఈ సినిమా చాలా మందికి ఫేవరెట్. ఇప్పటికీ టీవీల్లో తొలి ప్రేమ సినిమా వస్తే అసలు వదిలి పెట్టరు. కరుణా కరన్ తెరకెక్కించిన తొలి ప్రేమ సినిమా 1998 జులై 24న రిలీజైంది. అంటే ఈ సినిమా రిలీజై సుమారు 26 ఏళ్లు గడిచాయి.. అంతకు ముందు కేవలం మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగానే గుర్తింపు ఉన్న పవన్ కల్యాణ్ కు తొలి ప్రేమ సినిమా మరింత క్రేజ్ తీసుకొచ్చింది. అదే సమయంలో ఈ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలో హీరోయిన్‌గా నటించిన కీర్తి రెడ్డి కూడా ఓవర్ నైట్ ఫేమ్ సొంతం చేసుకుంది. ఆమె అందం, అభినయానికి యువత ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ సినిమాలోని కీర్తి రెడ్డి ఎంట్రీ సీన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలి ప్రేమ తర్వాత పలు సినిమాల్లో నటించింది కీర్తి రెడ్డి. రావోయి చందమామ సినిమాలో నాగార్జున మరదలిగా కనిపించింది. అలాగే అర్జున్‌ మూవీలో మహేష్ బాబు సోదరిగా మెప్పించింది. ఆతర్వాత బాలీవుడ్ కి వెళ్లింది. అక్కడ కూడా రెండు మూడు సినిమాలు తీసింది. అయితే అంతగా సక్సెస్ కాలేకపోయింది.

ఇవి కూడా చదవండి

సినిమాల సంగతి పక్కన పెడితే.. కీర్తి రెడ్డి హీరో అక్కినేని సుమంత్ ను పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి చేసుకున్న ఏడాదికే సుమంత్, కీర్తి రెడ్డి విడిపోయారు. సుమంత్ తో విడాకుల తర్వాత ఒక ఎన్‌ఆర్‌ఐను రెండో వివాహం చేసుకుంది కీర్తి రెడ్డి. ఆ తర్వాత అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోన్న ఆమె పిల్లల ఆలనాపాలనలోనే బిజీ బిజీగా గడుపుతోంది. ఇక సోషల్‌ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండడం లేదు. అయితే ఆ మధ్యన ఒక సినిమా ఫంక్షన్‌లో కనిపించి సందడి చేసిందీ అందాల తార.

 

 తొలి ప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.