AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nee Sneham: ‘నీ స్నేహం’ సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?.. ఎలా మారిపోయారంటే..

స్నేహంతోపాటు.. ప్రేమ రెండు విడదీయలేని బంధాల్ని కథాంశంగా రూపొందించిన ఈ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించింది.

Nee Sneham: 'నీ స్నేహం' సినిమాలో ఉదయ్ కిరణ్ స్నేహితుడు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా ?.. ఎలా మారిపోయారంటే..
Nee Sneham
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2023 | 11:28 AM

Share

దివంగత హీరో ఉదయ్ కిరణ్ కెరీర్‏లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రాల్లో నీ స్నేహం ఒకటి. పరుచూరి మురళి దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఎమ్ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ఉదయ్ కిరణ్, ఆర్తి అగర్వాల్ జంటగా నటించగా.. కళాతపస్వి కె. విశ్వనాథ్ కీలకపాత్రలో నటించారు. 2002 నవంబర్ 1న విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ఉదయ్, ఆర్తి తమ నటనతో ప్రేక్షకుల మనసులను హత్తుకున్నారు. స్నేహంతోపాటు.. ప్రేమ రెండు విడదీయలేని బంధాల్ని కథాంశంగా రూపొందించిన ఈ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను మెప్పించింది.

ఇక ఈ సినిమాకు ఆర్పీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ పెద్ద ఎస్సెట్. ఇప్పటికీ నీ స్నేహం మూవీ సాంగ్స్ ఎవర్ గ్రీన్ హిట్. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ అందుకుంటాయి. ఉదయ్ తన సహజ నటనతో ఆకట్టుకోగా.. అతని స్నేహితుడిగా నటించిన జతిన్ కూడా పాత్రలో ఒదిగిపోయాడు. వీరిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ సీన్స్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించాయి. ఈ సినిమా తర్వాత జతిన్ స్క్రీన్ పై కనిపించింది చాలా తక్కువే. జతిన్ హిందీ నటుడు. ముంబైలో పుట్టిన ఆయన.. మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత పలు ప్రైవేట్ ఆల్బమ్స్, హిందీ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ కార్యక్రమాల్లో కూడా నటించారు. తెలుగుతోనే కాకుండా హిందీతోపాటు పంజాబీ చిత్రాల్లో నటించారు. తెలుగు కేవలం నీస్నేహం సినిమాలో మాత్రమే నటించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. 2010లో కరోలినా గ్రేవాల్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నివసిస్తున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి
Jatin

Jatin

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి