Dia Movie: బ్లాక్ బస్టర్ హిట్ ‘దియా’ మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..

డైరెక్టర్ కే.ఎస్. ఆశోఖ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి కృష్ణ చైతన్య నిర్మించారు. ఈ సినిమాకు అజనీస్ లోకనాథ్ సంగీతం అందించారు. కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు.. తెలుగువారిని సైతం ఆకట్టుకుంది. ఇందులో పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు.

Dia Movie: బ్లాక్ బస్టర్ హిట్ 'దియా' మూవీ హీరోయిన్ గుర్తుందా ?.. ఇప్పుడేం చేస్తుందంటే..
Dia Movie
Follow us
Rajitha Chanti

| Edited By: seoteam.veegam

Updated on: May 18, 2023 | 6:47 PM

ఇటీవల కాలంలో ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగులో డబ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. కేవలం థియేటర్లలోనే కాకుండా.. అటు ఓటీటీ వేదికగా విడుదల అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. ఆ జాబితాలోనే కన్నడ సూపర్ హిటి చిత్రం దియా ఒకటి. 2020లో విడుదలైన ఈ సినిమాకు యూత్ లో ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. డైరెక్టర్ కే.ఎస్. ఆశోఖ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ స్వర్ణలత ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి కృష్ణ చైతన్య నిర్మించారు. ఈ సినిమాకు అజనీస్ లోకనాథ్ సంగీతం అందించారు. కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు.. తెలుగువారిని సైతం ఆకట్టుకుంది. ఇందులో పృథ్వీ అంబర్, దీక్షిత్ శెట్టి, ఖుషీ రవి ప్రధాన పాత్రలలో నటించారు.

ఈ ట్రయాంగిల్ ప్రేమకథలో ముఖ్యంగా చెప్పుకొవాల్సింది దియా పాత్ర. ఆ అమ్మాయి జీవితంలోకి వచ్చిన ఇద్దరబ్బాయిల ప్రేమకథే.. దియా. ఇందులో దియా పాత్రలో ఖుషీ రవి నటించింది. ఈ సినిమాలో ఆమె నటన హైలెట్. మల్టీపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో ఖుషీ జీవించింది. ప్రేమ, దుఃఖం.. నిస్పృహ వంటి వివిధ భావోగ్వాలలో అంతర్ముఖమైన అమ్మాయిగా ఖుషి నటనకు ప్రేక్షకులు ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాతో ఖుషీకి తెలుగులోనూ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే ఈ సినిమా తర్వాత ఖుషి మళ్లీ తెరపై కనిపించలేదు.

ఇవి కూడా చదవండి

ఖుషీ బెంగుళూరులో జన్మించింది. 2020లో దియా సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె.. కన్నడతోపాటు.. తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా తర్వాత స్పూకీ కాలేజ్, నక్షీ చిత్రాల్లో నటించింది. ఈ సినిమా తర్వాత ఖుషి మరో చిత్రంలో కనిపించలేదు. అయితే సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా చీరకట్టులో పుత్తడి బొమ్మలా ముస్తాబయ్యింది. తాజాగా ఖుషి షేర్ చేసిన బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.