కార్తికేయ 2.. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా రూ. 12.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ. 45.60 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.