AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Muskaan: జార్జి రెడ్డి మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. ఆస్ట్రేలియాలో ఏం చేస్తుందో తెలుసా?

ఈ సినిమా విజయంలో హీరోయిన్ ఖుబ్‌చాంది పాత్ర కూడా కీలకమే. మాయగా, ముస్కాన్ గా డబుల్ రోల్‌లో నటించి మెప్పించిందీ అందాల తార. ముఖ్యంగా ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ సాంగ్ లో ముస్కాన్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటతో మంగ్లీకి ఎంత పేరు వచ్చిందో ముస్కాన్ కు కూడా అంతే క్రేజ్ వచ్చింది.

Muskaan: జార్జి రెడ్డి మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడేంటిలా మారిపోయింది.. ఆస్ట్రేలియాలో ఏం చేస్తుందో తెలుసా?
Actress Muskaan Khubchandani
Basha Shek
|

Updated on: Aug 17, 2024 | 6:29 PM

Share

2019లో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం జార్జి రెడ్డి. ఓయూ విద్యార్థి నేత జార్జి రెడ్డి జీవిత కథ ఆధారంగా జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించాడు. సిల్లి మాంక్స్ స్టూడియోస్, మిక్ మైక్స్, థ్రి లైన్ సినిమాస్ పతాకాలపై అప్పీ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. జార్జి రెడ్డి పాత్రలో యంగ్ హీరో సందీప్ మాధవ్ అద్భుతంగా నటించాడు. రియల్ జార్జి రెడ్డిలా, రెట్రో లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇక ఈ సినిమా విజయంలో హీరోయిన్ ఖుబ్‌చాంది పాత్ర కూడా కీలకమే. మాయగా, ముస్కాన్ గా డబుల్ రోల్‌లో నటించి మెప్పించిందీ అందాల తార. ముఖ్యంగా ‘వాడు నడిపే బండీ రాయల్ ఎన్.ఫీల్డు. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ సాంగ్ లో ముస్కాన్ డ్యాన్స్, ఎక్స్ ప్రెషన్స్ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ పాటతో మంగ్లీకి ఎంత పేరు వచ్చిందో ముస్కాన్ కు కూడా అంతే క్రేజ్ వచ్చింది. హీరో వెంట పడుతూ రెట్రో లుక్ లో కనిపించిన ముస్కాన్ అందానికి యూత్ అందరూ ఫిదా అయ్యారు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో ముస్కాన్ కూడా ఫేమస్ హీరోయిన్ అయిపోతుందనుకున్నారు చాలా మంది. కానీ అదేమీ జరగలేదు. తెలుగులో జార్జి రెడ్డి తర్వాత ముస్కాన్ కేవలం ఒక్క సినిమానే చేసింది. రాజశేఖర్ నటించిన శేఖర్ లో ఒక కీలక పాత్ర పోషించింది. ఇక ఆ తర్వాత ఏ సినిమాలోనూ కనిపించలేదు.

ముస్కాన్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. చిన్నప్పటి నుంచే జిమ్నాస్టిక్స్ నేర్చుకుంది. అలాగే కథన్ లో ప్రావీణ్యం ఉంది. ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. లాక్మే, లేయార్ వోట్టా గర్ల, కాఫీ బైట్ వంటి ఫేమస్ యాడ్స్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ మూవీ వీర్ ది వెడ్డింగ్‌లో ఒక కీలక పాత్రలో మెరిసింది. ఆ తర్వాత జార్జి రెడ్డి సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది. లక్ష్మీ, 420 ఐపీసీ, శేఖర్ తదితర సినిమాల్లోనూ నటించింది.

ఇవి కూడా చదవండి

ముస్కాన్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

అయితే ఆ తర్వాత జెన్ బుద్దీ అనే బిజినెస్ మెన్ ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరికి ఒక పాప ఉంది. ముస్కాన్ ఇప్పుడు చైల్ట్ ఎడ్యుకేటర్‌గా పని చేస్తోది. పిల్లల సంరక్షణ గురించి వీడియోలు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
నిరుద్యోగులకు పండగపూట శుభవార్త.. తెలంగాణ RTCలో ఉద్యోగ నోటిఫికేషన్
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
సవరించిన ఐటీఆర్ లేదా ఆలస్యమైన ఐటీఆర్? డిసెంబర్ 31 లోపు ఏది దాఖలు
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
కొత్త ఏడాదిలో గోల్డెన్ ఛాన్స్.. అదృష్టం ఈ రాశుల సొంతం!
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
ఆ వ్యాధిగ్రస్తులకు ఈ డ్రింక్‌.. అమృతంతో సమానం.. రోజూ తాగితే..
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
సమంత కోసం ఎయిర్‌పోర్ట్‌కు రాజ్ నిడిమోరు వీడియో
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
నువ్వు గ్రేట్ బాసూ.! చేసేది డెలివరీ బాయ్ ఉద్యోగం.. కట్ చేస్తే..
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
మొలకెత్తిన ఉల్లిపాయలు తింటున్నారా..? అయితే, ఇది మీ కోసమే.. లేదంటే
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో 'దూద్ సోడా' జోరు.. ఏమిటీ దీని స్పెషాలిటీ?
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు