Sindhu Menon: చందమామ సెకెండ్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి.. ఎలా మారిపోయిందో తెలుసా?

నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్ హీరో హీరోయిన్లు గా నటించారు. కాజల్ ను సాఫ్ట్ గా చూపిస్తే, ఆమె సోదరి పాత్రలో సింధు మీనన్ ను గడుసు పిల్లగా చూపించారు కృష్ణ వంశీ. ఇందులో ఆమె రాణి పాత్రలో రౌడీ పిల్లగా కడుపుబ్బా నవ్వించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కాజల్ కంటే సింధు మీనన్ ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తుంది.

Sindhu Menon: చందమామ సెకెండ్ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడు ముగ్గురు పిల్లల తల్లి.. ఎలా మారిపోయిందో తెలుసా?
Sindhu Menon
Follow us
Basha Shek

|

Updated on: Aug 31, 2024 | 6:22 PM

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తన సినిమాల్లో హీరోయిన్లను ఎంతో అందంగా చూపిస్తుంటారు. డేరింగ్ అండ్ డ్యాషింగ్ గర్ల్స్ లా, అల్లరి పిల్లలా కథానాయికల పాత్రలను తీర్చిదిద్దుతుంటారు. అలా కృష్ణ వంశీ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో చందమామ ఒకటి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా తెరకెక్కిన ఈ సినిమాలో . నవదీప్, కాజల్ అగర్వాల్, శివబాలాజీ, సింధు మీనన్ హీరో హీరోయిన్లు గా నటించారు. కాజల్ ను సాఫ్ట్ గా చూపిస్తే, ఆమె సోదరి పాత్రలో సింధు మీనన్ ను గడుసు పిల్లగా చూపించారు కృష్ణ వంశీ. ఇందులో ఆమె రాణి పాత్రలో రౌడీ పిల్లగా కడుపుబ్బా నవ్వించింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో కాజల్ కంటే సింధు మీనన్ ఎక్కువగా స్క్రీన్ పై కనిపిస్తుంది. చూడడానికి అచ్చం పక్కింటమ్మాయిలా, పల్లెటూరి పిల్ల పాత్రలో సింధు నటన అందరినీ ఆకట్టుకుంది. బెంగళూరుకు చెందిన సింధు చైల్డ్ ఆర్టిస్టుగా రెండు చిత్రాల్లో నటించి మెప్పించింది.ఆ తర్వాత శ్రీహరి హీరోగా వచ్చిన భద్రాచలం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి చిత్రంతోనే అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత త్రినేత్రంలో దెయ్యంగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ మెప్పించింది.

వీటితో పాటు శ్రీరామ చంద్రులు, ఇన్ స్పెక్టర్, ఆడంతే అదే టైపు సినిమాల్లో నటించింది సింధు మీనన్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది. ఇక చందమామ, వైశాలి సినిమాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకుందీ అందాల తార. దీంతో హీరోయిన్ గా సింధు బిజీ అయిపోతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. తెలుగులో జగపతి బాబు హీరోగా వచ్చిన సిద్ధం సినిమాలో చివరిగా కనిపించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత కొన్ని మలయాళ మూవీస్ లో మాత్రమే నటించింది.

ఇవి కూడా చదవండి

ముగ్గురు పిల్లలతో నటి సింధు మీనన్..

కాగా 2010లో సింధు యూకే లో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన డొమినిక్ ప్రభు అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమెకు ఓ కూతురు, ఇద్దరు కుమారులున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సింధు సోషల్ మీడియాలో యాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన ఫ్యామిలీ ఫొటోలను తరచూ అందులో షేర్ చేసుకుంటోంది.

భర్త, పిల్లలతో సింధు మీనన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.