Arundathi Movie: బాబోయ్.. ఈ ముద్దుగుమ్మ అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్ ఆ ?.. చిన్నారి జేజమ్మ ఇప్పుడెలా ఉందంటే..
ఈ సినిమాలో సోనూసూద్, అర్జున్ బజ్వా, షాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి పశుపతి పాత్రలో సోనూసూద్ యాక్టింగ్ హైలెట్ అయ్యింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటీ అందించిన మ్యూజిక్ మరింత ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి బుల్లితెరపై అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ పోషించిన అనుష్క.. అరుంధతి చిత్రంతో మరో సాహసమే చేసింది.అయితే ఇందులో అరుంధతి చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారికి మంచి గుర్తింపు వచ్చింది.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ మలుపు తిప్పిన సినిమా అరుంధతి. లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఈ మూవీలో జేజమ్మగా తనదైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఇందులో అనుష్క నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాతోనే తెలుగులో స్వీటీ క్రేజ్ పెరిగింది. డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈసినిమా 2009లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాలో సోనూసూద్, అర్జున్ బజ్వా, షాయాజీ షిండే కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి పశుపతి పాత్రలో సోనూసూద్ యాక్టింగ్ హైలెట్ అయ్యింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటీ అందించిన మ్యూజిక్ మరింత ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి బుల్లితెరపై అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ పోషించిన అనుష్క.. అరుంధతి చిత్రంతో మరో సాహసమే చేసింది.అయితే ఇందులో అరుంధతి చిన్ననాటి పాత్రలో కనిపించిన చిన్నారికి మంచి గుర్తింపు వచ్చింది.
చిన్నారి జేజమ్మగా కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ పేరు దివ్య నగేష్. తెలుగు, తమిళం భాషలలో పలు చిత్రాల్లో బాలనటిగా కనిపించింది. కానీ అరుంధతి సినిమాతోనే దివ్య గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో అద్భుతమైన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్ లోనే మర్చిపోలేని సినిమాగా నిలిచిపోయింది. సినిమాలు మాత్రమే కాకుండా అటు పలు కమర్షియల్ యాడ్స్ చేసింది దివ్య. కొన్నాళ్లుగా దివ్య మరో సినిమాల్లో కనిపించడం లేదు.
కానీ తాజాగా దివ్య నగేష్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చిన్నారి జేజమ్మగా అలరించిన దివ్య..ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కటౌట్ తో ఆశ్చర్యపరుస్తుంది. త్వరలోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు ట్రై చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మలయాళం, తమిళంలో ఈ వయ్యారి సినిమాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో కథానాయికగా అవకాశాలు వస్తే మాత్రం నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దివ్య లేటేస్ట్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



