
దివంగత డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కంటెంట్ సినిమాలను రూపొందించిన దర్శకుడు. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో ఆరుగురు పతివ్రతలు ఒకటి. 2004లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఎందుకంటే అప్పటివరకు కామెడీ సినిమాలతో అలరించిన ఈవీవీ.. ఇలాంటి సినిమా చేయడంతో జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. అలాగే ఈ మూవీలో తన పాత్రతో విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది ఓ హీరోయిన్. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఆమె పాత్ర పై మాత్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆమె పేరు అమృత. ఆరుగురు పతివ్రతలు సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది ఈ కన్నడ బ్యూటీ.
అంతకుముందు కన్నడలో అనేక సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది అమృత. కానీ తెలుగులో చేసిన ఒక్క సినిమాతోనే ఫేమస్ అయిపోయింది. భర్తకు, ప్రియుడికి మధ్య సతమతమయ్యే స్త్రీగా తన నటనతో మెప్పించింది. ఈ సినిమా విడుదలైన సమయంలో అమృతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరోవైపు ఆమె యాక్టింగ్ పై ప్రశంసలు కూడా వచ్చాయి. ఈసినిమా తర్వాత అమృత తెలుగులో మరో సినిమా చేయలేదు. 2009లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది.
అమృత.. తెలుగు, కన్నడలో కలిపి మొత్తం ఎనిమిది సినిమాల్లో నటించింది. 2009లో జోడి నెంబర్ 1 సినిమాలో చివరిసారిగా కనిపించింది. అయితే వరుస అవకాశాలు వస్తున్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. అయితే వివాహం తర్వాత మరెక్కడ కనిపించలేదు అమృత. అలాగే ఆమె సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది. ఆమెకు సంబంధించిన వివరాలు, ఫోటోస్ కూడా తెలియరాలేదు. కానీ ఇప్పుడు ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి అమృత పేరు నెట్టింట మారుమోగుతుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..