Tollywood : అప్పుడు పిల్లల టీవీ యాంకర్.. కట్ చేస్తే ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్
ఇండస్ట్రీలో ఆమె ఓ క్రేజీ హీరోయిన్.. చూస్తూ ఉండిపోవాలనిపించే అందం ఆమె సొంతం.. తన వయ్యారంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది ఆ సుందరి. యాంకర్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంతకూ ఈ క్రేజీ బ్యూటీ ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోయిన్స్ కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న రోల్స్ చేసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. కొంతమంది టీవీ సీరియల్స్ లు, యాంకర్స్ గా చేసి కూడా హీరోయిన్స్ గా మారిన వారు ఉన్నారు. అలాగే పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. నటిగా తనను తాను నిరూపించుకుంటుంది ఆ ముద్దుగుమ్మ . అందం అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. అలాగే తనదైన స్టైల్ లో డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. అంతే కాదు అందంలోనూ ఈ చిన్నది అప్సరసే.. చూస్తే అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేసి మెప్పించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
పై ఫొటోలో ఉన్న హీరోయిన్ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి ఇప్పుడు హీరోయిన్ గా మారింది. అంతే కాదు తన క్యూట్ నెస్ తో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ రెజీనా కసాండ్రా. తెలుగులో నటించిన శివ మనసులో శృతి అనే సినిమాతో అడుగుపెట్టింది ఈ భామ. ఆతర్వాత క్రేజీ ఆఫర్స్ అందుకుంది. శివ మనసులో శృతి తర్వాత , రొటీన్ లవ్ స్టోరీ , కొత్త జంట సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగుతోపాటు తమిళ్ తోపాటు కన్నడ భాషలోనూ సినిమాలు చేసింది. అలాగే బాలీవుడ్ లోనూ నటించింది ఈ బ్యూటీ. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. కాగా రెజీనా సినిమాల్లోకి రాక ముందు చిన్న వయసులోనే ఓ పిల్లల టీవీ ఛానల్ లో యాంకర్ గా చేసింది. 14 సంవత్సరాల వయస్సులో రెజీనా కసాండ్రా ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం ‘కంద నాన్ మూ’లో లైలా చెల్లెలుగా నటించింది. ఆతర్వాత హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం హిందీలో జెట్ అనే సినిమా చేస్తుంది రెజీనా. వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఈబ్యూటీకి అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.