Tollywood: కొత్త సినిమాలు శుక్రవారం రోజే ఎందుకు రిలీజ్ అవుతాయో తెలుసా ?.. అసలు కారణమిదే..

|

Apr 21, 2023 | 10:58 AM

కొత్త సినిమాలు శుక్రవారం మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా ?.. వీకెండ్స్ అంటే.. శనివారం.. ఆదివారం కాకుండా.. కేవలం శుక్రవారం మాత్రమే విడుదల చేయడానికి గల కారణం చాలా మందికి తెలియదు. అందుకు గల కారణమేంటో తెలుసుకుందామా..

Tollywood: కొత్త సినిమాలు శుక్రవారం రోజే ఎందుకు రిలీజ్ అవుతాయో తెలుసా ?.. అసలు కారణమిదే..
Tollywood Movies
Follow us on

శుక్రవారం వచ్చిందంటే చాలు సినీ ప్రియులకు పండగే. ప్రతి వారం ఈరోజున ఒక్క సినిమా అయినా థియేటర్లలోకి రావాల్సిందే. భాష ఏదైనా సరే.. అన్ని సినిమాలు శుక్రవారం మాత్రమే ఆడియన్స్ ముందుకు వస్తుంటాయి. వారంలో శుక్రవారం అంటే సినీపరిశ్రమలో పండగ వాతావరణం వచ్చేస్తుంది. అయితే కొత్త సినిమాలు శుక్రవారం మాత్రమే ఎందుకు రిలీజ్ చేస్తారని ఎప్పుడైనా ఆలోచించారా ?.. వీకెండ్స్ అంటే.. శనివారం.. ఆదివారం కాకుండా.. కేవలం శుక్రవారం మాత్రమే విడుదల చేయడానికి గల కారణం చాలా మందికి తెలియదు. అందుకు గల కారణమేంటో తెలుసుకుందామా.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చిన్న, పెద్ద చిత్రాల హవా నడుస్తోంది. స్టార్ హీరోహీరోయిన్స్ సినిమాలు మాత్రమే కాదు.. కంటెంట్ నచ్చితే చిన్న చిత్రాలకు సైతం బ్రహ్మరథం పడుతున్నారు ఆడియన్స్.  ఇక ఈరోజు శుక్రవారం (ఏప్రిల్ 21) మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినీపరిశ్రమలో శుక్రవారం మాత్రమే కొత్త సినిమాలు రిలీజ్ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవెంటంటే.. చాలా కాలంగా ఇండస్ట్రీలో ఇది ఆనవాయితీగా వస్తుంది. సినిమా అనేది హాలీవుడ్ లో రూపొంది.. అక్కడే తొలి థియేటర్ ప్రదర్శన జరుపుకుంది. శుక్రవారం రోజునే మూవీస్ రిలీజ్ చేయాలనే సంస్కృతిని హాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ట్ చేశారు. మొదట్లో హాలీవుడ్ లో ఏ రోజు పడితే ఆరోజు సినిమాలు రిలీజ్ అయ్యేవి. కానీ కలెక్షన్స్ మాత్రం ఎక్కువగా వచ్చేవి కావు. దాంతో మేకర్స్ చర్చించుకుని శుక్రవారం మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారు. ఆరోజే ఎందుకంటే.. ఇండస్ట్రీలో శుక్రవారం వేతనాలు ఇచ్చే రోజు. సోమవారం నుంచి శుక్రవారం వరకు పనిచేయించుకుని శుక్రవారం జీతం ఇచ్చి శని, ఆదివారాలు సెలవులు ఇచ్చేవారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం వేతనం రాగానే నేరుగా థియేటర్లకు వస్తారని ఆరోజే సినిమాలు విడుదల చేసేవారు. ఇక ఆ తర్వాత రెండు రోజులు శ‌ని, ఆదివారం హాలీడేస్ కావ‌డంతో ఆ మూడు రోజులు క‌లెక్ష‌న్లు బాగా వ‌చ్చేవ‌ట‌. హాలీవుడ్‌లో అలా శుక్ర‌వారం విడులైన మొద‌టి సినిమా ‘గాన్ విత్ ది విండ్’. 1939లో డిసెంబ‌ర్ 15న ఈ చిత్రం విడుద‌లైంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇండియాలోనూ అదే పద్దతిని పాటిస్తున్నారు. సీనియర్ నటుడు రాజ్ కపూర్ హీరోగా నటించిన నీల్ కమల్ సినిమా సోమవారం విడుదలైంది. తెలుగులో పాతాళ భైరవి , మాయబజార్ సినిమాలు కూడా శుక్రవారం విడుదల కాలేదు. అయితే ఈ సంప్రదాయం బాలీవుడ్ ఇండస్ట్రీలో 1960లో వచ్చిన మొఘల్ ఎ అజమ్ సినిమాతో మొదలైంది. అప్పటి నుంచి ఇండియాలో సినిమాలు శుక్రవారం మాత్రమే విడుదల చేస్తున్నారు. అలాగే మన దేశంలో శుక్రవారాన్ని లక్ష్మీ దేవతగా పరిగణిస్తారు. ఈరోజు చాలా మంది శుభ సూచికంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే నిర్మాతలకు శుక్రవారం మంచి లాభాలు వస్తాయని భావించి కొత్త సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అలాగే శుక్రవారం మల్టీప్లెక్స్ రెంట్ మిగతా రోజుల కంటే తక్కువగా ఉంటుందట. ఈ క్రమంలోనే నిర్మాతలు మల్టీపెక్స్ యజమానులకు శుక్రవారం తక్కువ రెంట్ ను పే చేస్తారట. అందుకే ఇండస్ట్రీలో కొత్త సినిమాలను శుక్రవారం రోజునే విడుదల చేస్తారు.