AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు తోపు హీరోయిన్.. మాఫియా డాన్ తో ఎఫైర్, డ్రగ్స్ కేసు.. కట్ చేస్తే సన్యాసిని

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా రాణించిన వారు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తమ అందంతో కుర్రకారును కట్టిపడేసిన ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాంటి వారిలో ఈ వయ్యారి భామ ఒకరు. ఆ అప్పుడు తోప్ హీరోయిన్ గా రాణించిన ఈ భామ ఇప్పుడు సన్యాసిగా మారిపోయింది.

అప్పుడు తోపు హీరోయిన్.. మాఫియా డాన్ తో ఎఫైర్, డ్రగ్స్ కేసు.. కట్ చేస్తే సన్యాసిని
Actress
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2025 | 9:05 AM

Share

హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ పెట్టుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. ఒకొక్కరూ ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడిపిన వారు కూడా ఉన్నారు. చాలా మంది హీరోయిన్స్ తమ ప్రేమ వ్యవహారల కారణంగా వార్తల్లో నిలిచారు. ఎంతో మంది ప్రేమ , బ్రేకప్, రిలేషన్స్, డేటింగ్స్ ఇలా చాలా మంది హీరోలు, హీరోయిన్స్ వార్తల్లో నిలిచారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం చాలా డేంజర్. ఏకంగా మాఫియా డాన్ తోనే రిలేషన్ పెట్టుకుంది. ఆమె చిన్న హీరోయిన్ కాదు. ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది ఈ అమ్మడు. అయితే ఆ నటి హఠాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత మమత భారత్‌కు తిరిగి వచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? మాఫియా డాన్ తో ఎఫైర్ పెట్టుకుంది. ఆతర్వాత డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది.. ఇప్పుడు ఆధ్యాత్మిక బాటలోకి దిగింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

90వ దశకంలో తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. ఆమె మమతా కులకర్ణి.  బాలీవుడ్ లో ఎంతో మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అయితే ఉన్నట్టుండి కనిపించకుండా పోవడంతో ఆమెపై చర్చ మొదలైంది. ఎట్టకేలకు 24 ఏళ్ల తర్వాత మమత భారత్‌కు తిరిగి వచ్చింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడతారా.? అనే ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ హీరోయిన్ పలు విషయాలను వెల్లడించింది. దీంతో పాటు డ్రగ్స్ కేసు విషయాలు కూడా మాట్లాడింది.

ఇవి కూడా చదవండి

భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని మమత చెబుతూ.. ‘భారతదేశం నుంచి వెళ్లిపోవడానికి అతిపెద్ద కారణం ఆధ్యాత్మికత.. 1996లో నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపాను, ఆ సమయంలో నేను గురు గగన్ గిరి మహరాజ్‌ను కలిశాను. ఆయనను కలిసిన తర్వాత నాకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగింది. ‘బాలీవుడ్ నాకు కీర్తి, సంపదను ఇచ్చిందని నేను అంగీకరిస్తున్నాను. ఆ తర్వాత బాలీవుడ్ లో ఆదరణ కోల్పోయాను. నేను చాలా సంవత్సరాలు దుబాయ్‌లో ఉన్నాను. 12 ఏళ్లపాటు బ్రహ్మచారిగా ఉన్నాను. అలాగే ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు నేను సన్యాసిని. నాకు బాలీవుడ్‌పైనా, దేనిపైనా ఆసక్తి లేదు. మళ్లీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే వయసు కూడా లేదు. నేను ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఆధ్యాత్మిక చర్చలలో పాల్గొనాలనుకుంటున్నాను.’ అని చెప్పుకొచ్చింది.

మమతా కులకర్ణి

Mamta Kulkarni

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.