AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఈ క్రేజీ బ్యూటీ ఎవరో కనిపెట్టరా.?

ఈ ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ గుర్తుపట్టారా.? ఆమె ఎవరో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది. ఇప్పుడు ఆమె అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. క్యూట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ ఆమె.. అందం మాత్రమే కాదు అదిరిపోయే అభినయం ఈ వయ్యారిది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

అప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఈ క్రేజీ బ్యూటీ ఎవరో కనిపెట్టరా.?
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Oct 27, 2025 | 10:07 AM

Share

సినిమా ఇండస్ట్రీలో అందం అభినయం ఉండి అవకాశాలు రాక ఎదురుచూస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అదృష్టం కలిసి రాక ఆఫర్స్ లేక సోషల్ మీడియాతోనే గడుపుతున్నారు కొందరు. అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఛాన్స్‌లు రాక ఇండస్ట్రీకి దూరం అయ్యారు చాలా మంది. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో అవకాశాలు తగ్గి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చిన్న చిన్న పాత్రలు చేసింది. అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆతర్వాత కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. కానీ లాభం లేకుండా పోయింది. అలాగే కన్నడ, మలయాళంలోనూ ట్రై చేసింది. అయినా సక్సెస్ అవ్వలేదు.

ఒక డిజాస్టర్, రెండు హిట్స్.. దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ.. ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ

ఓ దర్శకుడిని రహస్యంగా పెళ్లి చేసుకొని వార్తల్లోనూ నిలిచింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? చాలా మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. వారిలో పూనమ్ బజ్వా ఒకరు. నవదీప్ హీరోగా నటించిన మొదటి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత ప్రేమంటే ఇంతే అనే సినిమాలో నటించారు. ఆతర్వాత నాగార్జున హీరోగా నటించిన బాస్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అలాగే అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా నటించింది. ఆతర్వాత తమిళ్ లోనూ సినిమాలు చేసింది. అలాగే కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

ఇక హీరోయిన్స్ సర్దుకోవాల్సిందే..! ఇండస్ట్రీకి కొత్త బ్యూటీ దొరికేసింది మావ.!!

తెలుగులో చివరిగా బాలకృష్ణ నటించిన ఎన్.టి.ఆర్. కథానాయకుడు సినిమాలో కనిపించింది. ఈ సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ చిన్నది అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే ఎక్కువ సమయం గడుపుతుంది. తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ‘ఓం త్రీడి’ సినిమాను తెర‌కెక్కించిన సునీల్ రెడ్డితో పూనమ్‌కి రహాస్యంగా పెళ్లి జరిగిందని వార్తలు వచ్చాయి. దీని పై క్లారిటీ లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

రవితేజ, ప్రభాస్‌లతో హిట్స్.. ఆఫర్స్ తగ్గడంతో నటనకు గుడ్ బై చెప్పనుందా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఐఆర్సీటీసీ ధమాకా ఆఫర్! ఏ నగరం నుండైనా దుబాయ్ ఎగిరిపోవచ్చు!
ఐఆర్సీటీసీ ధమాకా ఆఫర్! ఏ నగరం నుండైనా దుబాయ్ ఎగిరిపోవచ్చు!
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
యోగాలో ఇది అతి సింపుల్‌ ఆసనం.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
అద్భుతం అంటే ఇదేనేమో.. తల్లి కర్మకాండలకు సిద్ధమైన వేళ.. ఇంట్లో..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
W,W,W,W,W.. హ్యాట్రిక్‌తో సరికొత్త చరిత్ర..
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
సంక్రాంతి వేళ శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు.. మీకు వచ్చాయా..?
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
అలసట, నీరసంతో ఇబ్బంది పడుతున్నారా.. పతంజలి యౌవనామృత్ వటితో చెక్
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
నందమూరి జయకృష్ణ గురించి ఈ విషయాలు తెలుసా..?
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
ఏం చేసినా లైఫ్‌లో కిక్కు రావట్లేదా?.. ఇదే మీరు చేస్తున్న పొరపాటు
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
పండుగ అందం అంతా ఈ బ్యూటీలోనే.. లంగావోణీలో ఎంత బాగుందో కదా..
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా
తక్కువ ధరకే దొరికే చికెన్‌లోని ఈ పార్ట్‌ని తింటే ఏమవుతుందో తెలుసా