AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్న హీరో, అమ్మ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఆమె ఎవరంటే

ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ చాలా మంది హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోలు, హీరోయిన్స్ సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఉన్నారు. కొంతమంది సక్సెస్ అవుతుంటే మరికొంతమంది కనిపించకుండా పోయారు. తాజాగా మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా నట వారసురాలే..

నాన్న హీరో, అమ్మ హీరోయిన్.. కూతురికి మాత్రం ఒక్క హిట్ లేదు.. ఆమె ఎవరంటే
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 22, 2025 | 5:01 PM

Share

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నట వారసులు ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి హీరోలుగా, హీరోయిన్స్ గా రాణిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అయితే కొంతమందికి మాత్రం అదృష్టం కలిసి రావడం లేదు. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ కూడా ఉన్నారు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. కానీ అంతగా సక్సెస్ కాలేకపోతోంది ఈ అమ్మడు. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసినా కూడా అంతగా సక్సెస్ కాలేకపోతుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందంలోనూ అప్సరసే.. ఇంతకూ ఆమె ముద్దుగుమ్మ ఎవరో కాదు.

పవన్ కళ్యాణ్‌తో స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా.? సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గత్తర..

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్స్‌గా ఎదిగారు. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు శివాత్మిక రాజశేఖర్. స్టార్ హీరో రాజశేఖర్, జీవిత కూతురు శివాత్మిక. ఈ ముద్దుగుమ్మ దొరసాని సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే హీరోయిన్ గా మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆతర్వాత తమిళ్ ఇండస్ట్రీలో అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ ఆనందం విలయదుం వీడు, నితమ్ ఒరు వానం సినిమాలు చేసింది. కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక తెలుగులో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటించిన పంచతంత్రం, కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగ మార్తాండ సినిమాలు చేసింది.

ఇవి కూడా చదవండి

సినిమాలో అలా.. బయట ఇలా..! పిచ్చెక్కిస్తున్న పొలిమేర బ్యూటీ

కానీ ఆ సినిమాలు కూడా ఈ అమ్మడికి సాలిడ్ హిట్ అందించలేకపోయాయి. అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాల విషయం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే వరుసగా సినిమాలు చేయకుండా చిన్న గ్యాప్ ఇచ్చింది. కానీ ఈ ముద్దుగుమ్మ సినిమా కోసం ఆమె అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. మరో వైపు రాజశేఖర్, జీవిత మరో ముద్దుల కూతురు. శివాని రాజశేఖర్ కూడా అందం, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన.. సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఈ అమ్మడు కూడా నెట్టింట తన అందాలతో రచ్చ చేస్తుంది. ఈ ఇద్దరు అక్కా చెల్లెలు మంచి హిట్స్ తో దూసుకుపోవాలని.. తెలుగు హీరోయిన్స్ గా రాణించాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.

మరి గడ్డి పీకమంటావా .? నెటిజన్ ప్రశ్న ప్రియదర్శికి చిర్రెతించింది.. అసలు ఏమైందంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.