AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమాలో అలా.. బయట ఇలా..! పిచ్చెక్కిస్తున్న పొలిమేర బ్యూటీ

హారర్ సినిమాలకు మినీమన్ గ్యారెంటీ ఉంటుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు పక్కా హిట్ అవుతాయి. డిఫరెంట్ కథలతో తెరకెక్కే హారర్ సినిమా ఇప్పటికే చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో మా ఊరి పొలిమేర సినిమా ఒకటి. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

సినిమాలో అలా.. బయట ఇలా..! పిచ్చెక్కిస్తున్న పొలిమేర బ్యూటీ
Maa Oori Polimera
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2025 | 6:03 PM

Share

హారర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. భయపడుతూనే సినిమాను చూస్తుంటారు కొందరు.హారర్ సినిమాలంటే చాలా మందికి ఇష్టం.. ఇక హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలా వచ్చిన సినిమాల్లో మా ఊరి పొలిమేర సినిమా ఒకటి. ఈ సినిమా డైరెక్టర్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. బ్లక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య కీలకపాత్రల్లో నటించారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలోనే ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. కాగా ఈ సినిమా అంత పెద్ద విజయం సాదిస్తుందని ఎవ్వరూ ఉంచలేదు. దాంతో మా ఊరి పొలిమేర 2 సినిమాను థియేటర్స్ లో విడుదలచేశారు.

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై భోగేంద్రగుప్త నిర్మించిన ఈ సినిమాకు డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించాడు. మా ఊరి పొలిమేర 2 సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాల్లో సత్యం రాజేష్ భార్యగా కామాక్షి భాస్కర్ల నటించింది . అలాగే గెటప్ శ్రీను భార్యగా నటించిన బ్యూటీ గుర్తుందా.? ఆమె ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించి ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

రాములు అనే పాత్రలో ఆ చిన్నది నటించింది. ఆమె పేరు సాహితి దాసరి. సినిమాల్లోకి రాక ముందు సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు చాలా క్రేజ్ తెచ్చుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ గా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ క్రేజ్‌తోనే సినిమాల్లో ఛాన్స్ అందుకుంది. సింగర్ సునీత కొడుకు హీరోగా నటించిన సర్కారు నౌకరి అనే సినిమాలోనూ నటించింది. చిన్న చిన్న సినిమాలతో మెప్పిస్తున్న సాహితి దాసరి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబందించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

సాహితి దాసరి ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us