తొక్కలో సంచాలక్ .! మాట మార్చింది.. సుమన్ శెట్టిని బలి చేసింది.. ఓ రేంజ్‌లో పేలుతున్న ట్రోల్స్
బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. అయితే ముందు నుంచి ఈసారి సీజన్ విన్నర్ తనూజ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అందుకు తగినట్లుగానే ఆమె ఫ్యాన్స్, పీఆర్ టీమ్స్ ఎక్కువగానే కష్టపడుతున్నారు. మరవైపు తనూజకు నెగిటివిటీ కూడా ఎక్కువగానే ఉంది.

బిగ్ బాస్ హౌస్ లో మహానటి పేరు తెచ్చుకుంది తనూజ. ఎక్కడ కంటెంట్ కావాలో అక్కడ బాగా నటిస్తూ బిగ్ బాస్ ను బాగానే ఇంప్రెస్ చేస్తుంది. అనవసరంగా ఏడవడం.. హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెట్టడం.. మాట మార్చడం అబ్బో తనూజ చేస్తున్న పనులకు ప్రేక్షకులకు మైండ్ పోతుంది. బిగ్ బాస్ కూడా ఆమెకు తెగ సపోర్ట్ చేస్తున్నాడు. తాజాగా అనవసరంగా సుమన్ శెట్టిని బలి చేసింది. బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ అవ్వడానికి రీతూకి , సుమన్ శెట్టికి ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. అడుగు దూరంలో అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ కు సంచలక్ గా తనుజను పెట్టాడు బిగ్ బాస్. కొన్ని బోర్డులు ఇచ్చి ఆ బోర్డులను స్టెప్స్ పై పెట్టమని చెప్పాడు. ఎవరైతే ముందు స్టెప్స్ పై బోర్డులు పెట్టుకుంటూ.. పైకి ఎక్కి కెప్టెన్ అనే జెండాను పట్టుకోవాలని చెప్పాడు.
పవన్ కళ్యాణ్‌తో స్టెప్పులేసిన ఈ బ్యూటీ గుర్తుందా.? సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలతో గత్తర..
అయితే ముందుగా సుమన్ శెట్టి ముందుగా బోర్డ్స్ ను సెట్ చేసి మెట్లు క్రియేట్ చేశాడు. చివరి మెట్టు పై సుమన్ బోర్డు పెట్టడానికి ట్రై చేశాడు. కానీ ఆ బోర్డు సరిగ్గా సెట్ అవ్వలేదు.. ఆయన సెట్ చేసుకుంటున్న టైమ్ లోనే సంచలక్ గా ఉన్న తనూజ సుమన్ ను వేళ్ళు వేళ్ళు అంటూ చెప్పడంతో సుమన్ శెట్టి వెళ్లి పైకి ఎక్కి జెండాను తీసుకున్నాడు. అందరూ సుమన్ శెట్టికి సపోర్ట్ చేశారు. కానీ డీమాన్ పవన్ రీతూకి సపోర్ట్ చేశాడు.
సినిమాలో అలా.. బయట ఇలా..! పిచ్చెక్కిస్తున్న పొలిమేర బ్యూటీ
సరిగా పెట్టలేదు సంచాలక్.. కావాలంటే చూడండి అంటూ ఎలా పెట్టాలో పెట్టి చూపించాడు డీమన్ పవన్. దాంతో తప్పు తెలుసుకున్న తనూజ మాట మార్చేసింది. డీమన్ పవన్ పై అరవడం మొదలు పెట్టింది. నువ్వెందుకు మాట్లాడుతున్నావ్ మధ్యలో..? అంటూ పవన్ పై అరవడం స్టార్ట్ చేసింది. పవన్ కూడా తనూజ పై సీరియస్ అయ్యాడు. దాంతో సుమన్ శెట్టి ఏం చెయ్యాలో అర్ధంకాక చూస్తూ ఉండిపోయాడు. సుమన్ కు సపోర్ట్ గా దివ్య, సంజన మాట్లాడినా కూడా తనూజ నేను సుమన్ ను వెళ్ళమని అనలేదు అంటూ మాట మార్చేసింది. ఫైనల్ గా తప్పు తెలుసుకున్న తనూజ.. రీతూని విన్నర్ గా అనౌన్స్ చేసింది. దాంతో రీతూ కెప్టెన్ అయ్యింది. పాపం సుమన్ శెట్టి మాత్రం అలా చూస్తూ ఉండిపోయాడు. దాంతో ప్రేక్షకులు తనూజ పై ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు.
మరి గడ్డి పీకమంటావా .? నెటిజన్ ప్రశ్న ప్రియదర్శికి చిర్రెతించింది.. అసలు ఏమైందంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




