AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోట్లకు మహారాణి.. నిర్మాత చేతిలో మోసపోయి వ్యభిచారిగా మారింది.. చివరకు శవాన్ని మోసేవారు కూడా లేరు

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వారు చాలా మంది. కొంతమంది స్టార్ హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. మరికొంతమంది స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదుర్కొని ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. కానీ ఈ హీరోయిన్ కోట్లకు మహారాణి.. కానీ

కోట్లకు మహారాణి.. నిర్మాత చేతిలో మోసపోయి వ్యభిచారిగా మారింది.. చివరకు శవాన్ని మోసేవారు కూడా లేరు
Actress
Rajeev Rayala
|

Updated on: Aug 05, 2025 | 12:19 PM

Share

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం.. ఎంతో మంది నిత్యం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఎంతో మంది సినిమాల్లో రాణించాలని కోటి ఆశలతో అడుగుపెడుతూ ఉంటారు. కొంతమంది సక్సెస్ అవుతుంటారు. కానీ ఎంతో మంది సరైన అవకాశాలు లేక సినిమాలకు దూరం అవుతూ ఉంటారు. అయితే చాలా మంది సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. ఆతర్వాత ఆర్థిక ఇబ్బందులు పడుతూ వచ్చారు. చాలా మంది ఆర్థిక పరిస్థితి బాగోక ఇతర వృత్తుల్లోకి అడుగుపెడుతుంటారు. అయితే ఈ హీరోయిన్ మాత్రం కోట్లకు మహారాణి, నేషనల్ అవార్డు సినిమా చేసింది. కానీ ఆమె వ్యభిచారంలోకి దిగాల్సి వచ్చింది. చివరకు చిన్న వయసులో కన్నుమూసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది. ఆమె పేరు విమ్లేష్ వాధ్వాన్( విమీ). విమీ 1967లో బి.ఆర్. చోప్రా దర్శకత్వంలో వచ్చిన “హమ్రాజ్” చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. దాంతో విమీ ఒక్కసారిగా స్టార్‌గా మారింది. ఆమె సునీల్ దత్ సరసన నటించిన ఈ చిత్రంలో ఆమె అందం, నటన ప్రేక్షకులను ఆకర్షించాయి. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. విమీని ఒకప్పుడు బాలీవుడ్‌లో అత్యంత అందమైన నటిగా కూడా పిలిచేవారు. ఆతర్వాత ఈ స్టార్ హీరోయిన్ నటించిన “ఆబ్రూ” (1968) బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. ఆ తర్వాత ఆమె “పటంగ” (1971), “వచన్” (1974), “నానక్ నామ్ జహాజ్ హై” (1973) వంటి చిత్రాలలో నటించింది, కానీ ఈ చిత్రాలు ఆమెకు మళ్లీ విజయాన్ని అందించలేకపోయాయి.

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

విమీ శివ్ అగర్వాల్ అనే పారిశ్రామికవేత్త కుమారుడిని వివాహం చేసుకుంది . వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే, ఆమె భర్త మద్యపానానికి బానిస అవ్వడం.. అలాగే ఆమె కెరీర్‌లో జోక్యం చేసుకోవడం వల్ల పలువురు నిర్మాతలతో విభేదాలు ఏర్పడ్డాయి. దాంతో కెరీర్ పై ఎఫెక్ట్ పడింది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దాంతో విమీ, ఆమె భర్త జుహూలోని విలాసవంతమైన ఇంటి నుండి చిన్న ఇంటికి మారారు. ఆమె భర్తతో విడిపోయిన తర్వాత, ఆమె జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధం పెట్టుకుంది, అతను ఆమెకు సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి మోసం చేశాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా విమీ వ్యభిచారంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత మద్యపానానికి బానిస అయ్యింది. 1977 ఆగస్టు 22న, విమీ ముంబైలోని నానావతి ఆసుపత్రిలో అధిక మద్యపానం వల్ల కాలేయ సమస్యలతో మరణించింది. ఆమె మరణం సమయంలో ఆమె వయస్సు కేవలం 34 సంవత్సరాలు. ఆమె అంత్యక్రియలకు కేవలం తొమ్మిది మంది మాత్రమే హాజరయ్యారని, ఆమె శవాన్ని ఒక బండిపై శ్మశానానికి తీసుకెళ్లారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

Vimlesh Wadhawan

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.