AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.75కోట్లు బడ్జెట్.. థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. కానీ ఓటీటీలో దూసుకుపోతుంది

ఓటీటీల్లో సినిమాలకు రోజు రోజుకు క్రేజ్ పెరిగిపోతుంది. థియేటర్స్ లో వారం, వారం సినిమాలు విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీల్లోనూ సినిమాలు విశేషంగా మెప్పిస్తున్నాయి. వారం వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై ఆడియన్స్ కు డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి.

రూ.75కోట్లు బడ్జెట్.. థియేటర్స్‌లో డబుల్ డిజాస్టర్.. కానీ ఓటీటీలో దూసుకుపోతుంది
Ottmovie
Rajeev Rayala
|

Updated on: Aug 04, 2025 | 6:59 PM

Share

థియేటర్స్ లో వారం వారం కొత్త కొత్త సినిమాలు విడుదలై పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చిన్న చిన్న సినిమాల దగ్గర నుంచి భారీ బడ్జెట్ సినిమాలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇక థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకు సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి. థియేటర్స్ లో వచ్చిన టాక్ ప్రకారం ఓటీటీలోకి సినిమాలు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీలో మంచి టాక్ సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి ఓటీటీలో హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇక రీసెంట్ గా థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఊపేస్తోంది.

ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తమ్ముడు. రాబిన్ హుడ్ నిరాశపర్చడంతో తమ్ముడుపై భారీ ఆశలే పెట్టుకున్నాడు యూత్ స్టార్ నితిన్. పవన్ కల్యాణ్ టైటిల్, లయ రీ ఎంట్రీతో పాటు సినిమా పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో రిలీజ్ కు ముందే తమ్ముడు మూవీపై పాజిటిబ్ బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నిర్మాత దిల్ రాజు భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. అయితే జులై 04న థియేటర్లలో విడుదలైన తమ్ముడు సినిమా ఆడియెన్స్ ను పూర్తిగా నిరాశపర్చింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ మూవీలో కాంతార బ్యూటీ సప్తమి గౌడ హీరోయిన్ గా నటించింది. లయ, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుమారు 75 కోట్ల రూపాయల బడ్జెట్‌తో దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 01 నుంచే తమ్ముడు సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. థియేటర్స్ లో డిజాస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
కుంభ రాశి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ యూ టర్నే!
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
అద్భుతం! ఈ ఆలయంలో నీటితో దీపం వెలుగుతుందా? నిజం ఏంటి తెలుసా?
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
కమెడియన్ రాజబాబుతో ఇండస్ట్రీకి వచ్చాడు.. చిన్న పాత్రలకే కేరాఫ్..
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పనున్న ‘తలా’.. ఎప్పుడు, ఎక్కడంటే?
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ఆర్థిక స్థిరత్వానికి ఢిల్లీ సర్కార్ సంచలన నిర్ణయం..!
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
ITI విద్యార్థులకు గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే ట్రైనింగ్..
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!