AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యభిచారం చేస్తూ దొరికిందంటూ అబాంఢాలు.. ఆ మచ్చతో బ్రతకలేకపోయానంటున్న హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ సినిమాలతో మెప్పించి.. ఆతర్వాత కనిపించకుండా మాయమైన వారు చాలా మంది ఉన్నారు. కొన్ని సినిమాలతోనే స్టార్ డమ్ తెచ్చుకొని ఆతర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్స్ లో ఈ అమ్మడు ఒకరు. ఇప్పుడు సీరియల్స్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.

వ్యభిచారం చేస్తూ దొరికిందంటూ అబాంఢాలు.. ఆ మచ్చతో బ్రతకలేకపోయానంటున్న హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Nov 16, 2025 | 12:28 PM

Share

సినిమాలు, సీరియల్స్ ద్వారా ఎంతో మంది నటీ నటులు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. గ్లామర్ తో పాటు చక్కటి నటనను కనబరుస్తూ దూసుకుపోతున్నారు. ఇక ఎంతో మంది నటీమణులు సీరియల్స్ నుంచి సినిమాల వైపు అడుగులేస్తుంటే కొంతమంది మాత్రం సినిమాల నుంచి సీరియల్స్ వైపు నడుస్తున్నారు . అలాంటి వారిలో ఈ నటి ఒకరు. సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమె, ఫ్యామిలీ హీరోయిన్‌ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. కెరీర్ పీక్ లో ఉండగానే వ్యభిచారం చేస్తూ పట్టుపబడిందంటూ వార్తలు.. దాంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా కుదేల్ అయ్యింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్..

తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన నటీమణుల్లో యమున ఒకరు. ‘మౌన పోరాటం’ మూవీ తర్వాత ఈమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అందం, అభినయంతో తన మార్క్ చూపించింది. ఫ్యామిలీ హీరోయిన్‌ అనే ట్యాగ్ సంపాదించుకుంది. అయితే 2011లో బెంగళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఆమె పట్టుబడిందన్న వార్త అప్పుట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ కేసులో విటుడుగా సాఫ్ట్‌వేర్ కంపెనీ సిఈవోను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు సర్కులేట్ అయ్యాయి. దీంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యింది. సూటి పోటి మాటలు భరించలేక.. మీడియాకు కూడా దూరంగా జరిగారు. అయితే మౌనాన్ని బ్రేక్ చేస్తూ… గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో తనలోని బాధను, ఆవేదనను బయట ప్రపంచంతో పంచుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని, కావాలనే ఇరికించారని ఆమె కంటతడి పెట్టుకున్నారు.

లేని పోని అబాంఢాలు తనపై వేశారని యమున ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజు ఆ హోటల్ కి వెళ్లలేదని తెలిపారు. వ్యభిచారి అన్న మచ్చతో బ్రతకాలనిపించలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అని వెల్లడించారు. తాను చనిపోతే పిల్లలకు చెడ్డపేరు రాకుండా ఉంటుందని భావించానని, సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. పిల్లలకు ఆస్తులు వీలునామా రాసి.. తాను జీవితం చాలించాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఓ స్నేహితురాలు బ్రెయిన్ వాష్ చేయడంతో.. ఆ ఆలోచన విరమించుకున్నట్లు వెల్లడించారు. పిల్లల కోసం మనోధైర్యాన్ని నింపుకున్నట్లు తెలిపారు. ఎదుటివారి మాటలు అస్సలు పట్టించుకోకూడదని.. మనం ఏంటో మనకి తెల్సు అన్నది చాలా పుస్తకాలు చదివి నేర్చుకున్నట్లు యమున వెల్లడించారు. నా అనుమతి లేకుండా.. ఎవ్వరూ నా ఎమోషన్స్ టచ్ చేయలేరు అనేది మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయినట్లు తెలిపారు. ఆమెలా అందరూ మనో దైర్యంగా ఉండాలి.. షీ ఈజ్ ట్రూ ఫైటర్ అంటూ చెప్పుకొచ్చింది యమున.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us