
హీరోయిన్ గా అవకాశాలు అందుకోవడమే కాదు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం కూడా చాలా కష్టం. హీరోయిన్స్ గా సినిమాలు చేసి చాలా మంది స్టార్స్ గా మారారు. కానీ కొంతమంది మాత్రం ఎక్కువకాలం హీరోయిన్స్ గా కెరీర్ కొనసాగించలేక పోయారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ కొంతమంది అనుకున్నంతగా సక్సెస్ కాలేక పోతున్నారు. అలాంటివారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు.. మన తెలుగమ్మాయి అయినప్పటికీ ఈ చిన్నది తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో ఏడు సినిమాలు చేసింది కానీ ఆ ఏడు సినిమాల్లో ఒక్కటి కూడా అంతగా సక్సెస్ కాలేదు. అందం, అభినయం ఉన్నా కూడా ఈ అమ్మడికి స్టార్ డమ్ మాత్రం రాలేదు. ఇప్పుడు రూట్ మార్చి వేశ్య పాత్రలో నటిస్తుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
తెలుగులో ఎంతో మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ బ్యూటీ ఒకరు. బిందు మాధవి.. ఈ తెలుగమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు “అవకాయ్ బిర్యానీ” తో తన సినీ కెరీర్ మొదలుపెట్టింది. ఈ సినిమా సెకండాండ్రి రాజు దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ, తర్వాత ఆమె తమిళ సినిమా పరిశ్రమ వైపు దృష్టి సారించింది.
తమిళంలో “పొక్కిషం”, “కజుగు”, “కెడి బిల్లా కిల్లాడి రంగా” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో “రామ రామ కృష్ణ కృష్ణ”, “పిల్ల జమీందార్” వంటి సినిమాల్లో కూడా ఆమె నటన ప్రశంసలు అందుకుంది. బిందు మాదవి 2022లో తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమైన “బిగ్ బాస్ నాన్-స్టాప్” షో మొదటి సీజన్‌లో పాల్గొని విజేతగా నిలిచింది, దీనితో ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే సినిమాల్లో బిందు మాధవి పెద్దగా యాక్టివ్ గా లేదు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ చిన్నది ఓ ఛాలెంజింగ్ రోల్ తో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. దండోరా’ అనే సినిమాలో బిందు మాధవి నటించింది. ఈ సినిమాలో బిందు మాధవి వేశ్య పాత్రలో కనిపించింది. ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించాడు. తాను వేశ్య పాత్రలో కనిపించనున్నానని.. కానీ అందులో బోల్డ్ సీన్స్, అడల్ట్ కంటెంట్ అస్సలు ఉండవని.. ఎమోషన్స్ మాత్రం ప్రేక్షకులను హత్తుకుంటాయి అని బిందు మాధవి తెలిపింది. గతంలో నాని నటించిన సెగ సినిమాలోనూ బిందు మాధవి వేశ్య పాత్రలో నటించి ఆకట్టుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.