AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తారక్ అంటే పిచ్చి.. ఆయన ఆటోగ్రాఫ్ కావాలి..! స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్.. ఎన్టీఆర్ ఏం చేశారంటే

పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.

తారక్ అంటే పిచ్చి.. ఆయన ఆటోగ్రాఫ్ కావాలి..! స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్.. ఎన్టీఆర్ ఏం చేశారంటే
Ntr
Rajeev Rayala
|

Updated on: May 18, 2026 | 11:49 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు తారక్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాగా ఇప్పుడు ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ హీరోయిన్ తారక్ అంటే పిచ్చి అని ఆయన ఆటోగ్రాఫ్ కావాలని ఓ ఇంటర్వ్యూలో అడగటం ఆసక్తికరంగా మారింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. ప్రముఖ నటి ఖుష్బూ. గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సినిమా అనుభవాలు అలాగే ఆమె అభిమాన నటులు, భవిష్యత్ సినీ లక్ష్యాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు అత్యంత ఇష్టమైన హీరో గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయం చాలా మందికి తెలిసిన వాస్తవమేనని ఆమె పేర్కొన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూకు ఉన్న ఒక కోరిక ఏంటి.? అనే ప్రశ్న ఎదురవగా ఆమె  దీనికి స్పందిస్తూ..

ఇది కూడా చదవండి :చిన్నప్పుడు తెగ అల్లరి చేసేవాడు.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. గర్వంగా ఉందన్న రోజా

తాను జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. తాను తారక్‌కు చాలా పెద్ద అభిమానినని, “తారక్, మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నట్లయితే, నాకు తెలుసు, నేను చాలా పెద్ద ఫ్యాన్‌ను. నాకు ఒక ఆటోగ్రాఫ్, నా పేరు రాసి పంపించండి, అది చాలు నాకు”  అని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన కోరిక విని తారక్ ఇబ్బంది పడతారేమో అని సరదాగా వ్యాఖ్యానించారు. దీని పై తారక్ కూడా స్పందించారు.. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, గతంలో బృందా గారు ఒక సినిమా పాట షూటింగ్ సమయంలో మొదటిసారి ఖుష్బూ గారితో  కలిసి మాట్లాడా అని తెలిపారు తారక్. ఖుష్బూ వంటి సీనియర్ నటి, బాబాయ్‌తో (నందమూరి బాలకృష్ణ) కానివ్వండి, తమిళంలో, తెలుగులో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, తన పట్ల అలాంటి ప్రశంసను వ్యక్తం చేయడం ఒక తెలియని, గర్వంగా ఫీల్ అయ్యే అనుభూతి అని  తారక్ అన్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: ఆ స్టార్ హీరో హలీం వండితే పండగే.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే

నటిగా కంటే, ఒక మంచి వ్యక్తిగా కూడా ఖుష్బూను అభివర్ణించారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కావలి అని ఆమె అడగడం అది తీరని కోరిక అని చెప్పడం గొప్ప అనుభవం అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే తాను యమదొంగ చిత్రంలో ఖుష్బూతో నటించానని, అయితే వారిద్దరి మధ్య కాంబినేషన్ సీన్లు లేవని, ఆమె మోహన్ బాబు గారికి భార్యగా నటించారని గుర్తు చేసుకున్నారు ఎన్టీఆర్. భవిష్యత్తులో ఖుష్బూతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఆయన అన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి :అతను ఎంతో గొప్పనటుడు నటుడు.. ఆ హీరోకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..
మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి