బాహుబలి సినిమాలో అనుష్క డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఆమె ఓ హీరోయిన్

ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన సినిమా బాహుబలి. తెలుగు సినిమా సత్తాను ఇండియా వైడ్ గా చాటి చెప్పిన సినిమా బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసింది. వెయ్యికోట్లు వసూల్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రభాస్ హీరో, రానా దగ్గుబాటి విలన్ గా నటించిన బాహుబలి సినిమాలో తమన్నా, అనుష్క హీరోయిన్స్ గా నటించారు.

బాహుబలి సినిమాలో అనుష్క డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఆమె ఓ హీరోయిన్
Anushka

Updated on: Aug 18, 2025 | 7:10 PM

స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచిన సినిమాల్లో బాహుబలి ఒకటి. దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా రానా ప్రతినాయకుడిగా నటించి అలరించారు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన సంచలనం ఇంతా ఇంతా కాదు. రెండు పార్టులుగా వచ్చిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. మొదటి పార్ట్ లో బానిసగా.. సెకండ్ పార్ట్ లో యువరాణి గా నటించి అలరించింది. అనుష్క నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఒక పాత్రలో ప్రభాస్ తల్లిగా.. మరో పార్ట్ లో ప్రభాస్ భార్యాగా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమాలో అనుష్క పాత్రకు డూప్ గా నటించింది ఎవరో తెలుసా..? ఆమె కూడా ఓ హీరోయిన్..

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

ఈ అమ్మడు చూడటానికి అచ్చం అనుష్క లానే ఉంటుంది. దూరం నుంచి చూస్తే ఇద్దరు ఒకేలా ఉంటారు. అదే హైట్ , అదే కలర్ తో ఉంటారు. ఇంతకు అమ్మడు ఎవరు అంటే.. రుషిక రాజ్. 2021 లో వచ్చిన ‘అశ్మీ’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ప్రస్తుతం కన్నడలో సినిమాలు చేస్తూ రాణిస్తుంది ఈ భామ.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

ఈ సినిమాలో ఆమె బోల్డ్ గా నటించి మెప్పించింది రుషిక రాజ్. అనుష్కకు డూప్ గానే కాదు. బ్యా గ్రౌండ్ ఆర్టిస్ట్ గానూ కనిపించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు తన ఫొటోలతో కుర్రాళ్లను కవ్విస్తుంది. ఇక అనుష్క సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఘాటీ అనే సినిమాలో నటిస్తుంది. క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. సినిమాలో అనుష్క చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్నది.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.