కొడితే బద్దలవ్వాల్సిందే..! ఈ బాక్సింగ్ బ్యూటీ ఎవరో తెలుసా.? మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక బ్లాక్ బస్టర్
ఫిట్ నెస్ కోసం ముద్దుగుమ్మలు ఎంత కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో పాత్రలకు తగ్గట్టు హీరోయిన్స్ తమను తాము మార్చుకుంటూ ఉంటారు. ఇక హీరోయిన్స్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు,. ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ బ్యూటీ ఫోటో వైరల్ గా మారింది.

హీరోయిన్స్ ఫిట్ నెస్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. పాత్ర కోసం ఎలా కావాలంటే అలా తమ శరీరాన్ని మార్చుకుంటున్నారు హీరోయిన్స్. ముఖ్యంగా ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపిస్తున్నారు అందగత్తెలు. ఇక చాలా మంది హీరోయిన్స్ మంచి శరీరాకృతి కోసం జిమ్ లో తెగ కష్టపడుతుంటారు. ఫిట్ గా ఉండేందుకు కసరత్తులు చేస్తూ చెమట్లు చిందిస్తుంటారు. తాజాగా ఓ అమ్మడు జిమ్ లో తెగ కష్టపడుతుంది. పై ఫొటోలో ఉన్న నటి ఎవరో గుర్తుపట్టారా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. ఇలాంటి లవర్ మనకు ఉండాలి అని ప్రతి కుర్రాడు కలలు కనేలా ఉంటుంది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఇతర భాషలు భామలు మనదగ్గర చాలా మంది సత్తా చాటారు. వారిలో ఈ భామ ఒకరు. ఆ చిన్నదాని పేరు కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది.
చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇలా జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలను పంచుకుంది.
View this post on Instagram
కళ్యాణి ప్రియదర్శన్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








