Devadasu: రామ్ దేవదాసు సినిమాను ఆ హీరో మిస్ చేసుకున్నాడా..? ఆయన చేసుంటేనా..!!
రామ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రామ్ హీరోగా పరిచయమైన సినిమా దేవ్ దాస్. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. 2006లో విడుదలైన ఈ సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్ గా తెలుగులోకి పరిచయం అయ్యింది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు రామ్. రామ్ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. రామ్ హీరోగా పరిచయమైన సినిమా దేవ్ దాస్. వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ సినిమా యువతను విశేషంగా ఆకట్టుకుంది. 2006లో విడుదలైన ఈ సినిమాతో గోవా బ్యూటీ ఇలియానా కూడా హీరోయిన్ గా తెలుగులోకి పరిచయం అయ్యింది. రామ్, ఇలియానా ఇద్దరూ ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ బెస్ట్ డెబ్యూగా గెలుచుకున్నారు. ఇక ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు.
ఇక దేవదాసు సినిమాకు చక్రి సంగీతం అందించారు. అప్పట్లో ఈ పాటలు సంచలనం సృష్టించాయి. ఇప్పటికీ ఈ సాంగ్స్ అక్కడక్కడా మరు మ్రోగుతునే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ముందుగా హీరోగా రామ్ ను అనుకోలేదట దర్శకుడు వైవిఎస్ చౌదరి.
ముందుగా ఈ సినిమాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయాలనీ అనుకున్నారట. బన్నీ ఎనర్జీకి తగ్గట్టుగా కథను రాసుకున్నాడట దర్శకుడు. అయితే కథ నచ్చినా కూడా కొన్ని సన్నివేశాలు మార్చాలని అలాంటివి నాకు సూట్ కావు అని చెప్పారట. కానీ అందుకు వైవిఎస్ చౌదరి ఒప్పుకోలేదట. నా మేకింగ్ స్టైల్ ఇంతే.. నా కథను మారచాను అని అన్నారట. అలా ఆ మూవీ కథను రామ్ తో చేశాడట.
