ఇదేంది మావ..! రాజా ది గ్రేట్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా.?
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పటాస్ తర్వాత సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 3 లాంటి సినిమాలు చేసి ఆకట్టుకున్నాడు. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన సినిమాల్లో ఆల్ టైం సూపర్ హిట్ మూవీ ఏది అంటే చెప్పే సినిమాల్లో రాజా ది గ్రేట్ సినిమా ఒకటి. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రవితేజ అంధుడి పాత్రలో నటించాడు. ఈ సినిమా అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ మూవీలో రవితేజ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటించింది. అలాగే ప్రకాష్ రాజ్, రాధిక ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించాడు. సాయి కార్తీక్ సంగీతం అందించాడు. ఈ సినిమా తర్వాత రవితేజ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారు. ఇదిలా ఉంటే రాజా ది గ్రేట్ సినిమాకు ముందుకుగా మరో హీరోను అనుకున్నాడట దర్శకుడు అనిల్.
గతంలో ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. రాజా ది గ్రేట్ సినిమాకు రవితేజ కంటే ముందు మరో హీరోను అనుకున్నారట. ఆ హీరో ఎవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని. దీని గురించి అనిల్ మాట్లాడుతూ.. రాజా ది గ్రేట్ సినిమాకు ముందుగా రామ్ ను హీరోగా అనుకున్నాం అని అన్నారు.
రాజా ది గ్రేట్ ఫస్ట్ వర్షన్ కథ వేరు.. అదొక లవ్ స్టోరీ.. ఇప్పుడున్న సినిమాలో ఓ అమ్మాయిని కాపాడే బ్లైండ్ కుర్రాడి కథ. కానీ ముందుగా అనుకున్న దాంట్లో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. ఓ చిన్న హిందీ సినిమాలా అనుకున్నాం. డార్జిలింగ్ లో స్టార్ అయ్యే ప్రేమ కథ అందులో కూడా హీరో బ్లైండ్. ఓ అమ్మాయితో లవ్ లో పడ్డ తర్వాత ఆ అమ్మాయికి ఎదో ప్రాబ్లెమ్ వస్తే అతను అది ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ. కానీ కొన్ని టెక్నీకల్ ఇష్యుస్ వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేయాల్సి వచ్చింది. ప్రొడక్షన్ విషయంలో కన్ఫ్యూజన్ లో పడి అది సెట్ కాలేదు. అది సెట్ అయ్యేలోగా రామ్ హైపర్ సినిమా రిలీజ్ అయ్యింది. మళ్లీ వెంటనే కమర్షియల్ సినిమా చేయడానికి రామ్ ఆలోచించాడు అని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








