AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీదేవితో పెళ్లి ఆఫర్.. కుదరదు అని చెప్పిన నటుడు.. కారణం ఏంటో తెలుసా

భారతీయ సినీ పరిశ్రమలో అందం, అభినయంతో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన తార శ్రీదేవి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత హీరోయిన్‏గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన శ్రీదేవి మరణం ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు.

శ్రీదేవితో పెళ్లి ఆఫర్.. కుదరదు అని చెప్పిన నటుడు.. కారణం ఏంటో తెలుసా
Sridevi
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2025 | 10:19 AM

Share

అతిలోక సుందరి శ్రీదేవి తెలియని తెలుగు ప్రేక్షకులను ఉండరు. ఈ అందాల తార పుట్టినరోజు నేడు. ఆమె లేని బాధను అభిమానులు ఇప్పటికీ అనుభవిస్తున్నారు. శ్రీదేవి మరణం ఇప్పటికీ చాలామందిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అతను ఫిబ్రవరి 24, 2018 న మరణించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఈ అందాల తార తెలుగు, హిందీ, తమిళం, మలయాళం  భాషలలో వందలాది సినిమాలలో కథానాయికగా నటించింది. తెలుగులో ఒకప్పుడు ఉన్న అగ్ర హీరోలందరితోనూ నటించింది శ్రీదేవి. అప్పట్లో శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని చాలా మంది హీరోలు అనుకున్నారు. అయితే ఓ నటుడు కూడా శ్రీదేవిని తానే పెళ్లి చేసుకోవాల్సిందని తెలిపారు. శ్రీదేవిని పెళ్లి చేసుకోవాల్సింది నేనే అని ఆ నటుడు ఎవరో తెలుసా. ?

శ్రీదేవితో పెళ్లి మిస్ చేసుకున్న నటుడు ఎవరో కాదు.. సీనియర్ నటుడు, నిర్మాత అయిన మురళి మోహన్. ఒకప్పుడు మురళీమోహన్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మురళీమోహన్ 350 కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆతర్వాత ఆయన నిర్మాతగా, బిజినెస్ మ్యాన్ గా ఎదిగారు. ప్రస్తుతం మురళీమోహన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కెరీర్ బిగినింగ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అదే సమయంలో శ్రీదేవి కూడా వరుస సినిమాలతో స్టార్ గా రాణిస్తుంది. ఆ సమయంలో మురళీమోహన్ ను చూసిన శ్రీదేవి తల్లి మురళీ మోహన్ ను అల్లుడిగా చేసుకోవాలనుకున్నారట. ఇదే విషయాన్నీ శ్రీదేవికి కూడా చెప్పి ఒప్పించారట. అయితే ఆయనకు అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఆ విషయం ఆమెకు తెలియక శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడిగారట. అయితే ఓసారి శ్రీదేవితో కలిసి మురళీమోహన్ ఇంటికి కూడా వచ్చారట. శ్రీదేవిని పెళ్లి చేసుకోమని అడగ్గా ఆయన షాక్ అయ్యారట. తనకు పెళ్ళై పిల్లలున్నారని , కుదరదని చెప్పారట మురళీమోహన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..