థియేటర్స్ డిజాస్టర్.. ఓటీటీలో బ్లాక్ బస్టర్.. మూడేళ్ళుగా ట్రెండింగ్‌లో ఉన్న సినిమా
ఓటీటీలో రకరకాల సినిమాలు అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ లో ఉన్నాయి. ప్రతి శుక్రవారం థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. అలాగే శుక్రవారం వస్తే చాలు ఓటీటీలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ సినిమాలకు విపరీతమైన డిమాండ్ ఉంది.

ఓటీటీలు అందుబాటిలోకి వచ్చిన తర్వాత థియేటర్స్ తో పాటు ఓటీటీలోనూ సినిమాలు చూస్తూ ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్స్ లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి సినిమాలు. ఒకటికి రెండు సార్లు ఓటీటీలో తమ అభిమాన సినిమా చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాలు థియేటర్స్ లో డిజాస్టర్ అయిన సినిమాలు ఓటీటీల్లో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో డిజాస్టర్ అయ్యి.. ఓటీటీల్లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఏండ్ల తరబడి ట్రెండింగ్ లో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కూడా ఓటీటీలో అదరగొడుతుంది. మూడేళ్ళుగా ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది.
180కోట్లతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో భారీ డిజాస్టర్ అయ్యింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.. ఆ సినిమా మరేదో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా.. ఈ భారీ బడ్జెట్ సినిమా 2022లో రిలీజైంది. ఈ సినిమాలో నటించిన వారందరూ పెద్ద స్టారే.. ఈ సినిమాలో సంజయ్ దత్, కరీనా కపూర్ లాంటి స్టార్స్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య కూడా నటించారు.
ఇంగ్లీష్ మూవీ ఫారెస్ట్ గంప్ స్టోరీతో డైరెక్టర్ అద్వైత్ చందన్ దీన్ని తెరకెక్కించారు. ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్, జ్యోతి దేశ్‌పాండే, అజిత్ అంధారె నిర్మాతలుగా వ్యవహరించారు. థియేటర్స్ లో ఈ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. ఆమిర్ ఖాన్, నాగచైతన్య యాక్టింగ్‌కి మంచి మార్కులే పడినా ఈ మూవీ మాత్రం డిజాస్టర్ అయ్యింది. రూ.180 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓవర్ అల్ గా రూ. 120కోట్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దాదాపు మూడేళ్ళుగా లాల్ సింగ్ చద్దా సినిమా ట్రెండింగ్ లో ఉంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.