Tollywood: అయ్యబాబోయ్.! మర్యాద రామన్న హీరోయిన్ ఏంటి ఇప్పుడెలా మారిపోయింది.. చూస్తే స్టన్
సినీ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు తలుపుతట్టాలంటే.. అందం, అభినయం మాత్రమే సరిపోదు. వీటితో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ మూడు క్వాలిటీస్‌తో కొందరు హీరోయిన్లు స్టార్ స్టేటస్ సంపాదిస్తే..
సినీ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు తలుపుతట్టాలంటే.. అందం, అభినయం మాత్రమే సరిపోదు. వీటితో పాటు అదృష్టం కూడా తోడవ్వాలి. ఈ మూడు క్వాలిటీస్‌తో కొందరు హీరోయిన్లు స్టార్ స్టేటస్ సంపాదిస్తే.. మరికొందరు కేవలం కొన్ని చిత్రాలకే కనుమరుగైపోయారు. ఆ కోవకు చెందిన బ్యూటీనే సలోని అశ్వని. సునీల్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది సలోని. తెలుగులో 15కిపైగా చిత్రాల్లో నటించినప్పటికీ.. ఈ బ్యూటీ సరైన సక్సెస్ అందుకోలేదు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పటికీ.. ఈమెకు తెలుగులో మరిన్ని అవకాశాలు రాలేదు.
‘ఒక ఊరిలో’, ‘చుక్కల్లో చంద్రుడు’, ‘బాస్’, ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్’, ‘అధినాయకుడు’, ‘రేసుగుర్రం’.. వంటి చిత్రాలు సలోని కెరీర్‌లో హిట్స్‌గా నిలిచాయి. ఇక 2016లో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం కాగా.. మళ్లీ ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత ‘తంత్ర’ అనే హారర్ థ్రిల్లర్‌తో తెలుగు ఇండస్ట్రీలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న ‘మట్కా’ మూవీ, ‘హరుడు’ అనే చిత్రాలతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
View this post on Instagram
సలోని వ్యక్తిగత విషయానికొస్తే.. మహారాష్ట్రకు చెందిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ముంబైలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఆమె తండ్రి నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్న సలోనిని.. ఆమె తల్లి ఎలప్పుడూ ప్రోత్సహించింది.
View this post on Instagram
ఇది చదవండి: ఒంటరిగా చూడటమే బెటర్.! ఓటీటీలో రచ్చ రచ్చ.. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి