‘మనసంతా నువ్వే’ సినిమాతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టిన ఈ అందాల భామ గుర్తుందా? పెళ్లి తర్వాత ఎలా ఉందో తెలుసా?
అంతకుముందు కేవలం గ్లామర్ పాత్రలతోనే ఆకట్టుకున్న ఈ అందాల భామ ఈ సినిమాలో తన అభినయంతోనూ కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో అయితే అందరినీ కంటతడి పెట్టించింది.

తెలుగు తెరపై గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాల్లో మనసంతా నువ్వే ఒకటి. ఉదయ్ కిరణ్, రీమాసేన్ జంటగా 2001లో వచ్చిన ఈ లవ్‌స్టోరీ యువతను తెగ ఆకట్టుకుంది. చిన్నప్పటి స్నేహం, ప్రేమ వంటి అంశాలతో కూడుకున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎప్పటిలాగే ఈ సినిమాలోనూ తన నటనతో అదరగొట్టాడు ఉదయ్‌కిరణ్. ఇక హీరోయిన్ రీమాసేన్ పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోతుంది. అంతకుముందు కేవలం గ్లామర్ పాత్రలతోనే ఆకట్టుకున్న ఈ అందాల భామ ఈ సినిమాలో తన అభినయంతోనూ కట్టిపడేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లలో అయితే అందరినీ కంటతడి పెట్టించింది. ఈ సినిమాకు ముందు కొన్ని తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించింది రీమాసేన్. అయితే మనసంతా నువ్వే చిత్రం ఆమె కెరీర్‌కు పెద్ద బూస్ట్ ఇచ్చింది. కోల్‌కతాలో పుట్టి పెరిగిన రీమా 2001లో చిత్రం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంద. ఇందులోనూ ఉదయకిరణే హీరో. ఆతర్వాత నాగార్జునతో కలిసి బావనచ్చాడు సినిమాలో యాక్ట్ చేసింది. ఇక బాలకృష్ణతో సీమ సింహం, తరుణ్‌తో కలిసి అదృష్టం, రవితేజతో కలిసి భద్ర, పవన్‌కల్యాణ్‌తో బంగారం .. ఇలా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత యమగోళ మళ్లీ మొదలైంది, రెండు, యుగానికి ఒక్కడు, ముగ్గురు వంటి సినిమాల్లో నటించింది. కొన్ని తమిళ్, హిందీ సినిమాల్లోనూ నటించి అక్కడి ప్రేక్షకులను అలరించింది.
సినిమాల్లో ఉండగానే 2012లో పెళ్లిపీటలెక్కింది రీమాసేన్. ప్రముఖ రెస్టారెంట్ బిజినెస్ మ్యాన్ శివ కరణ్ సింగ్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా మరుసటి ఏడాదే రుద్రవీర్ అనే కొడుకు జన్మించాడు. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది రీమాసేన్. ఆమె చివరిసారిగా 2012లో గ్యాంగ్ ఆఫ్ వస్సేపూర్ అనే హిందీ సినిమాలో నటించింది. ఆ తర్వాత మరే సినిమాలోనూ కనిపించలేదు. యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేసిన రీమాసేన్ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోంది. అయితే అందంలో మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఏ మాత్రం తేడా లేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కనిపించే ఈ ముద్దుగుమ్మ తన కుటుంబంతో దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకున్న ఫొటోలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..




