AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Hema: ఆ హీరోని సచ్చినోడా అని తిట్టేశా.. అప్పటినుంచే అంతా మారిందన్న హేమ

హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాల్లోకి వచ్చిన తర్వాత సింపుల్ గా హేమగా మార్చుకుంది. అప్పుడెప్పుడో శ్రీదేవి, వెంకటేష్ ల క్షణ క్షణం నుంచి మొన్నటి దాకా సినిమాలు చేస్తూనే ఉందీ అందాల తార. 250 కు పైగా సినిమాల్లో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతంగా నటించింది హేమ.

Actress Hema: ఆ హీరోని సచ్చినోడా అని తిట్టేశా.. అప్పటినుంచే అంతా మారిందన్న హేమ
Hema
Rajeev Rayala
|

Updated on: Feb 01, 2026 | 6:08 PM

Share

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు నటి హేమ. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న నటి హేమ. హేమ తన అద్భుతమైన నటనతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చాలా సినిమాలు చేశారు. ముఖ్యంగా ప్రముఖ కమెడియన్ బ్రహ్మనందం కాంబినేషన్‌లో ఆమె చేసే సినిమాల్లోని సీన్స్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను నవ్వించేవి. అతడు సినిమాలో ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకులను నవ్వించారు. అలాగే సిద్దార్థ్ హీరోగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాలో తన నటనకుగానూ ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డును గెలుచుకున్నారు హేమ.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో హేమ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కష్టార్జితం కోసం డిమాండ్ చేయడానికి వెనుకాడనని, అవసరమైతే పక్కన ఉన్నవారి హక్కుల కోసం కూడా నిలబడతానని స్పష్టం చేశారు హేమ. రెమ్యూనరేషన్, క్యారవాన్‌లు వంటి విషయాల్లో తన డిమాండ్లు ఇతరులకు అహంకారంగా కనిపించినా, అది తన న్యాయమైన కోరికేనని హేమ పేర్కొన్నారు. చిరంజీవి గారితో తనకు మొదటి నుంచి మంచి అనుబంధం ఉందని, హేమ తెలిపారు.

ఆయన కుమారుడు రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. ఆ సినిమాలో తనను తిట్టే సన్నివేశంలో రామ్ చరణ్ ఎన్నో టేకులు తీసుకున్నాడని, చిన్నప్పటి నుంచి తెలిసిన తనను తిట్టడానికి అతనికి మనసు రాలేదని హేమ ఆప్యాయంగా వివరించారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకి ఆయనంటే మరింత ఇష్టం పెరిగిందని హేమ తెలిపారు. అలాగే మల్లీశ్వరి సినిమాలో వెంకటేష్‌ను తాను సచ్చినోడా అని పిలిచే సన్నివేశం గురించి కూడా హేమ వివరించారు. అంతకుముందు హీరోలను తెరపై తిట్టడం అనేది నిషిద్ధమని, బాలీవుడ్‌లో కానీ, చిరంజీవి గారిని కానీ ఎవరూ తిట్టేవారు కాదని గుర్తుచేసుకున్నారు. మల్లీశ్వరి  సినిమాతో ఈ సంప్రదాయం మారిందని, ఆ సన్నివేశంలో వెంకటేష్‌ తన దుస్తుల్లో ఉన్న పిన్నులను తీసి పేపర్‌లో పెట్టి ఇచ్చే సన్నివేశాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సంఘటన ఒక కొత్త ట్రెండ్‌కు నాంది పలికిందని హేమ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..