Rajamouli: ఏంటి.! ఆ ఫ్లాప్ సినిమాలో జక్కన్న నటించాడా.? ఇది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు..
ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు భారతదేశం ఒక్కటే కాదు.. ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. ఆయన ఇటీవల తీసిన..
ఎస్.ఎస్.రాజమౌళి.. ఈ పేరు ఇప్పుడు భారతదేశం ఒక్కటే కాదు.. ప్రపంచమంతా మారుమ్రోగుతోంది. ఆయన ఇటీవల తీసిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు రావడం ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే కేవలం హిందీ చిత్రాలు మాత్రమేనని అనుకునేవారు.. అయితే ఇప్పుడు బీ-టౌన్ హీరోలు సైతం రాజమౌళి చిత్రంలో నటించడానికి రెడీగా ఉన్నారు. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన జక్కన్న కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఈ దర్శకధీరుడు ఓ ఫ్లాప్ చిత్రంలో నటించారన్నది మీకు తెలుసా.? మరి అదేంటో తెలుసుకుందామా..
2008లో విఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘రెయిన్‌బో’. ఇందులో రాహుల్, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి, కోడి రామకృష్ణ చిన్న క్యామియో రోల్స్‌లో కనిపించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడిందని ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు ఆదిత్య చెప్పిన విషయం విదితమే.
కాగా, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని హీరో మహేష్ బాబుతో తెరకెక్కించనున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో గ్లోబల్ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టుకి పూర్తి కానుంది. ఆ తరువాత నుంచి కంప్లీట్ రాజమౌళి సినిమాకి షిఫ్ట్ అవ్వనున్నాడు మహేష్ బాబు.