AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthik Aryan : ఫస్ట్ మూవీకి ఊహించని రెమ్యునరేషన్.. ఇప్పుడు ఈ హీరో ఆస్తులు తెలిస్తే..

కార్తీక్ ఆర్యన్ 2011లో వచ్చిన 'ప్యార్ కా పంచనామ్' సినిమా ద్వారా రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. ఈ కారణంగా ఆయనను కొందరు బయటి వ్యక్తిగా భావించారు. అయితే బాలీవుడ్ మొత్తం మెచ్చే సినిమా చేశాడు. ఇప్పుడు నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Karthik Aryan : ఫస్ట్ మూవీకి ఊహించని రెమ్యునరేషన్.. ఇప్పుడు ఈ హీరో ఆస్తులు తెలిస్తే..
Karthik Aryan
Rajitha Chanti
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 26, 2024 | 9:00 AM

Share

బాలీవుడ్ ప్రముఖ నటుడు కార్తీక్ ఆర్యన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో చెప్పక్కర్లేదు. ఇటీవల విడుదలైన ‘భూల్ భూలయ్య 3’ సినిమాతో భారీ విజయం సాధించాడు. ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఇంతకు ముందు ఆ హీరో పరిస్థితి ఇలా ఉండేది కాదు. మొదటి సినిమాకు వేలల్లోనే పారితోషికం తీసుకున్నాడు. తాజాగా ఈ హీరో గురించి క్రేజీ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 2011లో ‘ప్యార్ కా పంచనామ్’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కార్తీక్ ఆర్యన్. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని ఫ్యామిలీ నుంచి ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండానే సినిమాల్లోకి వచ్చాడు. లవ్ రంజన్ దర్శకత్వం వహించిన ‘ప్యార్ కా పంచనామ్’ చిత్రం కేవలం 3 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించారు.

ఈ సినిమా 17 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. కార్తీక్ ఆర్యన్ ఈ చిత్రానికి 70 వేల రూపాయలు మాత్రమే పారితోషికం తీసుకున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కార్తీక్ ఆర్యన్‌కి ‘ప్యార్ కా పంచ్ నామ్’ సినిమా వచ్చింది. ఈ సినిమా కోసం అతను చాలా తక్కువ పారితోషికం తీసుకున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా రాణించడం అంటే అంత సులువు కాదు. అందుకే ముందు అవకాశాలను అందిపుచ్చుకుంటూ తానేంటో నిరూపించుకున్నాడు. 2018లో వచ్చిన ‘సోను కి టిట్టౌకి స్వీటీ’ సినిమా విజయం సాధించింది. 2022లో వచ్చిన ‘భూల్ భూలయ్య 2’ అతనికి పెద్ద విజయాన్ని అందించింది. అదే విధంగా ‘భూల్ భూలయ్య 3’ భారీ విజయాన్ని అందుకుంది. కార్తీక్ ఆర్యన్ దగ్గర లాంబోర్గినీ కారు ఉంది. ఆయన ఆస్తులు 46-50 కోట్ల రూపాయలు.

ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..

Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..

Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‏కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.