AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 15 ఏళ్ల వయసులోనే రెడ్ లైట్ ఏరియాలోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. చివరకు..

సినీగ్లామర్ ప్రపంచంలో తమకు గుర్తింపు తెచ్చుకున్న తారల జీవితాల్లో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. ఆర్థిక సమస్యలు, అవమానాలు, సవాళ్లు ఎదుర్కొని ఇప్పుడు ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం 15 ఏళ్ల వయసులోనే రహస్యంగా రెడ్ లైట్ ఏరియాలోకి వెళ్లిపోయింది. కట్ చేస్తే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood: 15 ఏళ్ల వయసులోనే రెడ్ లైట్ ఏరియాలోకి.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్.. చివరకు..
Actress
Rajitha Chanti
|

Updated on: Jun 02, 2025 | 10:41 AM

Share

భారతీయ సినిమాల్లో చాలా మంది హీరోయిన్స్ తమ పాత్ర కోసం ఎలాంటి సాహసమైన చేస్తుంటారు. విభిన్నమైన కంటెంట్.. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ సహజ నటనతో కట్టిపడేస్తుంటారు. ఇక తమ పాత్ర డిమాండ్ చేస్తే ఎంతటి రిస్క్ అయిన చేసేందుకు ముందుంటారు. కొత్త భాషలు, డ్యాన్స్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. అలాగే ఫిట్నెస్ విషయంలోనూ మార్పులు చేసుకుంటారు. కానీ మీకు తెలుసా.. ? ఓ హీరోయిన్ తన సినిమా, పాత్ర కోసమే ఎంతో రిస్క్ చేసి మరీ రహస్యంగా రెడ్ లైట్ ఏరియాలను సందర్శించింది. అంతేకాదు. టాప్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ సోనమ్ ఖాన్.

80’s లలో సన్నీ డియోల్, సంజయ్ దత్, నసీరుద్దీన్ షా వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. హిందీ భాషలలో దాదాపు 30 చిత్రాల్లో కథానాయికగా నటించిన ఆమె… బాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. ఆమె నటించిన వాటిలో త్రిదేవ్, క్రోధ్, కోడమా సింహం, మిట్టి ఔర్ సోనా, అజూబా, ఫతే గుర్తింపు తెచ్చిపెట్టాయి. తాజాగా 1989లో వచ్చిన పత్తర్ ఔర్ సోనా సినిమా కోసం సిద్ధమవుతున్నప్పుడు ఎన్నో సవాళ్లను ఎదురించినట్లు తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. తన అద్భుతమైన ఇమేజ్ నుండి తనను తాను వేరు చేసుకోవడానికి ఆ సినిమాలో కాలేజీ అమ్మాయిగా, అలాగే వేశ్య పాత్రలో కనిపించినట్లు రాసుకొచ్చింది. 15 ఏళ్ల వయసులోనే తాను రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి అక్కడి జీవితాన్ని చూశానని.. అక్కడి అమ్మాయిల ధైర్యం, అవగహాన ఇ్వడమే కాకుండా.. ఆ చిత్రంలో తన పాత్రను నిజాయితీగా పోషించడంలో తనకు సహయపడిందని రాసుకొచ్చింది.

అలాగే ఆ చిత్రంలో పొట్టి దుస్తుల ధరించిన సన్నివేశాల సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నానని.. అప్పట్లో గ్లామర్ సీన్స్ చేసేందుకు తాను నిరాకరించానని తెలిపింది. మేకప్ రూంలో ఏడుస్తున్న తనను చాలాసార్లు ఒప్పించిన తర్వాత సీన్స్ నటించేవాళ్లమని.. న్ని సంవత్సరాల క్రితం రెడ్ లైట్ ఏరియాలో చూసిన అమ్మాయిల నుండి ధైర్యం కూడగట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. సోనమ్ ఖాన్ నిర్మాత గుల్షన్ రాయ్ కుమారుడు రాజీవ్ రాయ్‌ను 1991లో వివాహం చేసుకుని దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైపోయింది. ప్రస్తుతం సోనమ్ ముంబైలో కుటుంబంతో కలిసి సంతోషమైన జీవితాన్ని గడుపుతుంది.

View this post on Instagram

A post shared by Sonam Khan (@sonamkhan_72)

ఇవి కూడా చదవండి :  

OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..

Nagarjuna: టాలీవుడ్‏ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..

Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..

OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..