Dhanush: ఎన్ని కుట్రలు చేసినా నన్ను ఆపలేరు.. ఎంత నెగిటివ్ ప్రచారమైనా చేసుకోండి.. ధనుష్ కౌంటర్ ఎవరికీ.. ?
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు హీరో ధనుష్. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే ఇటు నటుడిగా.. అటు దర్శకుడిగానూ మెప్పిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుబేర చిత్రంతో తెలుగు అడియన్స్ ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ కుబేర. డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రయూనిట్. తాజాగా జూన్ 1న చెన్నైలో కుబేర్ ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ధనుష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. తన రాబోయే సినిమాలపై వస్తోన్న నెగిటివ్ ప్రచారాన్ని గట్టిగానే ఖండించారు.
కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన రాబోయే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని.. ఎవరెన్ని చేసినా తనను ఏం చేయలేరని.. తన అభిమానులు తనపై వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయగలరని అన్నారు. తన సినిమా విడుదలకు నెల రోజులు ఉండగానే నెగిటివ్ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు ధనుష్. దీంతో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ధనుష్ మాట్లాడుతూ.. ” మీరు నాపై ఎంత నెగిటివ్ ప్రచారమైనా చేసుకోండి.. కానీ నా సినిమా విడుదలకు ముందు దేనినీ ఆపలేరు. నా అభిమానులు నాతోనే ఉంటున్నారు. నా గురించి నెగిటివ్ ప్రచారాన్ని చేసేవారు దయచేసి పక్కకు వెళ్లి ఆడుకోండి.మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడ నా అభిమానులు మాత్రమే కాదు.. నా సహచరులు కూడా ఉన్నారు. దాదాపు 23 ఏళ్లుగా నా అభిమానులు నాతోనే ఉన్నారు. నా గురించి నెగిటివ్ రూమర్స్ ప్రచారం చేసి నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే అంతకంటే ముర్ఖత్వం మరొకటి ఉండదు. గతంలో నేను చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రపంచానికి కుబేర వంటి సినిమా చాలా అవసరం. ఈ మూవీ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.
Never seen this D in these Years @dhanushkraja 🛐❤️🔥
Cut & Right Reply To The Haters !!!#KuberaaAudioLaunch #Kuberaa pic.twitter.com/eqxDzMPcv0
— Dhanush Thambinga Da (@dtd_team) June 1, 2025
ఇవి కూడా చదవండి :
OTT Movie: ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న క్రైమ్ సస్పెన్స్.. ఊహించని మలుపులు.. క్షణ క్షణం ఉత్కంఠ..
Nagarjuna: టాలీవుడ్‌ని ఏలేసిన హీరోయిన్.. కానీ నాగార్జునతో ఒక్క సినిమా చేయలేదు.. ఎందుకంటే..
Tollywood: ఇండస్ట్రీలో తోపు నటుడు.. కోట్లు వదిలి పల్లెటూరి జీవితాన్ని గడుపుతున్న హీరో.. కారణం ఇదే..
OTT Movie: ఇదెందీ మావ.. థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీని ఊపేస్తోంది.. దేశంలోనే టాప్ ట్రెండింగ్..




