Tollywood: కమల్ హాసన్‌తో ప్రేమ.. భర్త చేతిలో వేధింపులు.. చివరకు విషాదాంతంగా..
ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె స్టార్ హీరోయిన్. చిన్న వయసులోనే కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ హీరోయిన్.. నిజ జీవితంలో మాత్రం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. ప్రేమలో విఫలం.. భర్త చేతిలో వేధింపులు.. చివరకు విధి చేతిలోనూ ఒడిపోయింది.

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఇండస్ట్రీని ఏలేసిన టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి వరుస సినిమాల్లో నటించింది. సీనియర్ హీరో కమల్ హాసన్ ను పిచ్చిగా ప్రేమించింది. చివరకు వీరి ప్రేమను తన తల్లి అంగీకరించలేదు. మరోవైపు భర్త చేతిలో వేధింపులకు గురైంది. అతడితో విడాకులు తీసుకుని తిరిగి జీవితాన్ని ప్రారంభించిన ఆమెను క్యాన్సర్ కబలించింది. అనారోగ్య సమస్యలతో పోరాడుతునే తన ఆస్తి మొత్తాన్ని పేద పిల్లలకు దానం చేసి మరణించింది. ఆమె మరెవరో కాదు.. ఒకప్పటి సీనియర్ హీరోయిన్ శ్రీవిద్య. వెండితెరపై మెరిసే హీరోయిన్స్ చిరునవ్వుల వెనుక ఎన్నో కష్టమైన కథలు ఉన్నాయి. మానసికంగా.. ఒంటరితనంతో బాధపడుతూ సినిమాలకు దూరమైన తారలు చాలా మంది ఉన్నారు.
ఒకప్పుడు హీరోయిన్ గా చక్రం తిప్పిన శ్రీవిద్య.. ఆతర్వాత వయసుకు తగినట్లుగా తల్లి, అత్త, వదిన పాత్రలలో కనిపించింది. తనకంటే పెద్ద హీరోలకు సైతం తల్లి పాత్రలు పోషించింది. అయితే వెండితెరపై అద్భుతమైన నటనతో కట్టిపడేసిన శ్రీవిద్య.. నిజ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్ లతో కలిసి నటించిన కె. శ్రీవిద్య.. కమల్ హాసన్ ను ప్రేమించింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ వీరి పెళ్లికి శ్రీవిద్య తల్లి అంగీకరించలేదు. దీంతో 1978లో మలయాళీ దర్శకుడు జార్జ్ థామస్ ను పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత యాక్టింగ్ మానిసిన శ్రీవిద్యను నిత్యం వేధింపులకు గురిచేశాడు థామస్. అంతేకాదు ఆమె ఆస్తిని సొంతం చేసుకుని.. నిత్యం హింసించడం మొదలుపెట్టాడు. దీంతో 1980లో అతడి నుంచి విడాకులు తీసుకుంది.
విడాకుల తర్వాత మళ్లీ సినిమాల్లో నటించడం స్టార్ట్ చేసింది శ్రీవిద్య. సహయ నటిగా వరుస సినిమాల్లో నటించింది. అదే సమయంలో ఆమె జీవితాన్ని క్యాన్సర్ కబలించింది. కొన్నాళ్లపాటు క్యాన్సర్ నుంచి బయటపడేందుకు చికిత్స తీసుకున్న శ్రీవిద్య.. చివరకు 2006లో కన్నుమూసింది. అయితే మరణించే ముందు తన ఆస్తి మొత్తాన్ని పేద విద్యార్థులకు దానం చేసింది.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..