AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna : నాగార్జున శివుడిగా నటించిన సినిమా ఎదో తెలుసా..? చాలా మందికి తెలిసుండదు గురూ..

రొమాంటిమ్ హీరోగా.. మన్మదుడిగా పేర్లు తెచుకున్నప్పటికీ భక్తి రస చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు నాగార్జున. నిన్నే పిల్లాడతా లాంటి రొమాంటి హిట్ తర్వాత వెంటనే అన్నమయ్య అనే సినిమా చేశారు నాగార్జున. ఆ సమయంలో రిస్క్ ఎందుకు అని ఎంతమంది చెప్పిన నాగార్జున అన్నమయ్య చేసి తనను తాను నటుడిగా నిరూపించుకున్నారు.

Nagarjuna : నాగార్జున శివుడిగా నటించిన సినిమా ఎదో తెలుసా..? చాలా మందికి తెలిసుండదు గురూ..
Nagajruna
Rajeev Rayala
|

Updated on: Dec 02, 2023 | 3:39 PM

Share

చాలా మంది హీరోలు ఎలాంటి పాత్రలైనా అద్భుతంగా నటించి మెప్పించి ప్రేక్షకుల చేత శబాష్ అనిపించుకుంటుంటారు. కొంతమంది ఆ పాత్రకు వారు తప్ప మరెవరూ ప్రాణం పోయలేరు అనేలా జీవిస్తారు. అలాంటి వారిలో కింగ్ నాగార్జున ఒకరు. రొమాంటిమ్ హీరోగా.. మన్మదుడిగా పేర్లు తెచుకున్నప్పటికీ భక్తి రస చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు నాగార్జున. నిన్నే పిల్లాడతా లాంటి రొమాంటి హిట్ తర్వాత వెంటనే అన్నమయ్య అనే సినిమా చేశారు నాగార్జున. ఆ సమయంలో రిస్క్ ఎందుకు అని ఎంతమంది చెప్పిన నాగార్జున అన్నమయ్య చేసి తనను తాను నటుడిగా నిరూపించుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది.

ఆలాగే రామదాసు, ఓం నమో వేంకటేశాయ, షిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాల్లో నటించి మెప్పించారు నాగార్జున. అయితే నాగార్జున దేవుడు పాత్రలో నటించిన సినిమాలు కూడా రెండు ఉన్నాయి. నాగార్జున కృష్ణార్జున అనే సినిమాలో కృష్ణుడి పాత్రలో నటించారు. ఈ సినిమాలో మంచు విష్ణు కూడా నటించారు. ఈ సినిమా లో నాగార్జున కృష్ణుడి గెటప్ లో కకనిపించలేదు.

అలాగే నాగార్జున శివుడు పాత్రలోనూ నటించారు. నాగార్జున శివుని పాత్రలో కనిపించిన సినిమా జగద్గురు ఆది శంకర సినిమాలో నాగార్జున ఓ చిన్న పాత్రలో కనిపించారు. శివుడి తరహా పాత్రలో నాగార్జున కనిపించారు. ఆది శంకరకు కనువిప్పు చేసే చిన్న సన్నివేశంలో నాగార్జున నటించారు. సినిమాలో ఈ సన్నివేశంలో నాగార్జున అద్భుతంగా నటించారు. ఈ సీన్ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. అలాగే ఈ సినిమాలో మోహన్ బాబు, శ్రీహరి కూడా నటించారు.Nagajruna New

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.