AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ధనవంతుడైన హీరో ఎవరో తెలుసా ?.. చిరంజీవి, రజినీకాంత్‏ కంటే ఎక్కువే..

వాల్తేరు వీరయ్య సినిమాతో విజయాన్ని అందుకున్నా చిరంజీవీ.. భోళా శంకర్ మూవీ అంతగా మెప్పించలేకపోయారు. ఇక ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. ఇండస్ట్రీలో సినిమాలన్ని హిట్ కావడంతో ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ రెమ్యునరేషన్ భారీగానే పెంచేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ. రూ. 430 కోట్ల నికర విలువ కలిగిన రజనీకాంత్ జైలర్ కోసం రూ.110 కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకున్నారు.

Tollywood: సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక ధనవంతుడైన హీరో ఎవరో తెలుసా ?.. చిరంజీవి, రజినీకాంత్‏ కంటే ఎక్కువే..
Rajini, Chiranjeevi, Kamal
Rajitha Chanti
|

Updated on: Nov 22, 2023 | 10:10 AM

Share

సౌత్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఇటీవల బ్యాక్ టూ బ్యా్క్ చిత్రాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. జైలర్ సినిమాతో సూపర్ స్టార్ రజినీకాంత్ సెన్సెషన్ క్రియేట్ చేయగా.. విక్రమ్ సినిమాతో రికార్డ్ బ్రేక్ చేశాడు కమల్ హాసన్. ఇక దసరా కానుకగా లియో సినిమాతో అడియన్స్‏ను ఆకట్టుకున్నాడు విజయ్ దళపతి. వాల్తేరు వీరయ్య సినిమాతో విజయాన్ని అందుకున్నా చిరంజీవీ.. భోళా శంకర్ మూవీ అంతగా మెప్పించలేకపోయారు. ఇక ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు నందమూరి హీరో బాలకృష్ణ. ఇండస్ట్రీలో సినిమాలన్ని హిట్ కావడంతో ఇప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ రెమ్యునరేషన్ భారీగానే పెంచేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రూ. రూ. 430 కోట్ల నికర విలువ కలిగిన రజనీకాంత్ జైలర్ కోసం రూ.110 కోట్లను రెమ్యునరేషన్‌గా అందుకున్నారు.

అలాగే లియో కోసం విజయ్ దళపతి రూ.130 కోట్లు.. ఇండియన్ 2 కోసం రూ.150 కోట్లు తీసుకుంటున్నాడు కమల్ హాసన్. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అందరు స్టార్ హీరోలలో అత్యధిక ఆస్తి ఉన్న హీరో ఎవరో తెలుసా ?.. దాదాపు రూ.3010 కోట్లకు అధిపతి. GQ రిపోర్ట్ ప్రకారం.. ఇండస్ట్రీలో ఎక్కువ ఆస్తి కలిగిన హీరో అక్కినేని నాగార్జున. హీరోగానే కాకుండా నిర్మాతగా, టెలివిజన్ షో హోస్ట్ గా, పారిశ్రామికవేత్తగా సంపాదిస్తున్నారు. మూడు దశాబ్దాల సినీ ప్రయాణంలో 100కు పైగా చిత్రాల్లో నటించారు. ఒక్కో ప్రాజెక్ట్‌కి 9 నుంచి 20 కోట్ల వరకు తీసుకుంటాడు. నటన ద్వారా వచ్చే ఆదాయంతో పాటు, తన ప్రొడక్షన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమాలను నిర్మించడం ద్వారా ఆదాయాన్ని రాబడుతున్నారు. కేరళ బ్లాస్టర్స్ FC సహ యజమాని నాగార్జున తన సంపదను ఇండియన్ సూపర్ లీగ్ మరియు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టారు. నాగార్జునకు హైదరాబాద్‌లో గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది. పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్నారు.

నాగార్జున ఆస్తుల్లో హైదరాబాద్‌లో రూ.45 కోట్ల విలువైన బంగ్లా, అత్యాధునిక కార్ల కలెక్షన్లు, కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉన్నాయి. నాగార్జున తర్వాతి స్థానంలో దగ్గుబాటి వెంకటేష్, చిరంజీవి సౌత్ ఇండియన్ రిచెస్ట్ యాక్టర్స్ లిస్ట్‌లో ఉన్నారు. వెంకటేష్ ఆస్తుల విలువ రూ.2200 కోట్లు కాగా, చిరంజీవి ఆస్తుల విలువ రూ.1650 కోట్లు. GQ, టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ప్రకారం, రామ్ చరణ్ 1370 కోట్ల రూపాయలతో నాల్గవ స్థానంలో ఉన్నారు. దళపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, కమల్ హాసన్, అల్లు అర్జున్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.