Akhil -Niharika: ఏంటి అఖిల్- నిహారిక కలిసి ఒక షార్ట్ ఫిలిం చేశారా.. !! డైరెక్టర్ ఎవరంటే..

ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. మొన్నీమద్యే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Akhil -Niharika: ఏంటి అఖిల్- నిహారిక కలిసి ఒక షార్ట్ ఫిలిం చేశారా.. !! డైరెక్టర్ ఎవరంటే..
Akhil And Niharika
Follow us

|

Updated on: Nov 09, 2022 | 5:18 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న విషయం తెలిసిందే. అఖిల్ అనే సినిమాతో హీరోగా పరిచయమైన అఖిల్.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. మొన్నీమద్యే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో హిట్ అందుకున్నాడు ఈ కుర్ర హీరో.. ఇప్పుడు ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలు పెంచేశాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సినిమాల్లోకి రాకముందు అఖిల్ ఒక షార్ట్ ఫిలిం లో నటించడట. ఈ షార్ట్ ఫిలిం లో మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్ గా నటించిందట..

అయితే ఈ షార్ట్ ఫిలింకు దర్శక ధీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ దీనికి దర్శకత్వం వహించాడని అంటున్నారు. అయితే ఈ షార్ట్ ఫిలిం బయటకు రాలేదు. కారణాలు తెలియదు కానీ ఎందుకనో ఈ షార్ట్ ఫిలింను బయటకు రానివ్వలేదు. అయితే ఈ షార్ట్ ఫిలిం లో ఆశ అనే పాత్రలో కనిపించిందట నిహారిక. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది. అయితే ఇప్పటికైనా ఈ షార్ట్ ఫిలిం ను బయటకు తీసుకువస్తారా అన్న ప్రశ్నకు డబ్బులు రాకపోయినా పర్లేదు పరువు పోకూడదు.. అది ఒక కళాఖండం అని చెప్పుకొచ్చింది నిహారిక.

అయితే సినిమాల్లోకి రాకముందు  నిహారిక పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక ఒకమనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆతర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన నిహారిక. పెళ్లితర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ
నిడదవోలు ఎన్నికల బరిలో కస్తూరి సత్యప్రసాద్.. ప్రధాన పార్టీలకు దడ