AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmalamma: లెజెండరీ నటి నిర్మలమ్మ మనవడు ఎవరో తెలుసా..? సినిమాల్లో నటించాడు..

ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తల్లి, నాన్నమ్మ పాత్రలు పోషించింది. తెలుగులో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. చివరి శ్వాస వరకు సినిమానే ప్రపంచంగా జీవించింది నిర్మలమ్మ.

Nirmalamma: లెజెండరీ నటి నిర్మలమ్మ మనవడు ఎవరో తెలుసా..? సినిమాల్లో నటించాడు..
Nirmalamma
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2024 | 9:53 AM

Share

తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోని అలనాటి నటి నిర్మలమ్మ. నాటక రంగం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన ఆమె సహజ నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. మొదట హీరోయిన్ గా నటించి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగింది. ప్రధాన పాత్రలు కాకుండా సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించి మెప్పించింది. అప్పట్లో హీరోయిన్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో తల్లి, నాన్నమ్మ పాత్రలు పోషించింది. తెలుగులో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. చివరి శ్వాస వరకు సినిమానే ప్రపంచంగా బతికింది నిర్మలమ్మ.

కేవలం వెండితెరపై అలరించిన నిర్మలమ్మగానే అందరికీ తెలుసు. కానీ ఆమె జీవితం గురించి చాలా మందికి తెలియదు. నిర్మలమ్మ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణరావును పెళ్లి చేసుకుంది. అయితే వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో కొన్నాళ్లపాటు మానసిక ఒత్తిడికి గురయ్యారు నిర్మలమ్మ. ఆ తర్వాత కొద్దిరోజులకు కవిత అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. ఆమె పెళ్లిని నిర్మలమ్మ దంపతులు దగ్గరుండి జరిపించారు. కాగా ఆమెకు ఓ కుమారుడు జన్మించాడు. అతడి పేరు విజయ్ మాదాల. నిర్మలమ్మ వారసుడిగా విజయ్ మాదాల పడమట సంధ్యారాగం అనే సినిమాతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

కానీ చిన్నప్పటి నుంచి అమెరికాలో ఉండడం వల్లె అతడికి తెలుగు సరిగ్గా మాట్లాడటం రాలేదు. దీంతో సినిమాల్లో అంతగా రాణించలేకపోయాడు. విజయ్ మాదాల శోభ అనే అమ్మాయితో వివాహం కాగా ప్రియా అనే కూతురుకు జన్మనిచ్చారు. నిర్మలమ్మ 19 ఫిబ్రవరి 2009న 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.

Nirmalamma Fam

Nirmalamma Fam

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.