Rakul Preet Singh: వైవాహిక బంధంలోకి ప్రేమపక్షులు.. రకుల్, జాకీ భగ్నానీల కంబైన్డ్ ఆస్తులు ఎంతో తెలుసా ?..
ఇటీవల కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సరసన నటించిన అయలాన్ సినిమా విడుదదలై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న రకుల్.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుంది. తన ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి ఈనెల 21న ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే గోవాలో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు సినీ తారలు.. సన్నిహితులు రకుల్, జాకీ పెళ్లి వేడుకల కోసం గోవాకు చేరుకుంటున్నారు. సోమవారం రాత్రి హల్దీ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై.. టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యూటీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలు చేసింది ఈ ముద్దుగుమ్మ. దీంతో తెలుగు తెరకు దూరమైంది. కొన్నాళ్లుగా ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అంతగా రాలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఇండియన్ 2 సినిమా మాత్రమే ఉంది. ఇటీవల కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ సరసన నటించిన అయలాన్ సినిమా విడుదదలై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న రకుల్.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతుంది. తన ప్రియుడు జాకీ భగ్నానితో కలిసి ఈనెల 21న ఏడడుగులు వేయనుంది. ఇప్పటికే గోవాలో వీరి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. మరోవైపు సినీ తారలు.. సన్నిహితులు రకుల్, జాకీ పెళ్లి వేడుకల కోసం గోవాకు చేరుకుంటున్నారు. సోమవారం రాత్రి హల్దీ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. 2011లోనే తన ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రకుల్. కరోనా లాక్ డౌన్ సమయంలో తమ ప్రేమకథ మొదలైనట్లు చెప్పుకొచ్చింది.
ప్రకృతి… పర్యావరణానికి అనుకూలంగా రకుల్, జాకీ పెళ్లి ఎంతో సింపుల్ గా జరగనుంది. ఫిబ్రవరి 21న గోవాలోని బీచ్ ఒడ్డున వీరిద్దరి వివాహ వేడుక జరగనుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఇద్దరి కెరీర్, ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. తెలుగులో కొండపొలం, లౌక్యం, ధృవ, నాన్నకు ప్రేమతో, రారండోయ్ వేడుక చూద్దాం వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది రకుల్. ఇక జాకీ భగ్నానీ నిర్మాత. కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, కల్ కిస్నే దేఖా చిత్రాలను నిర్మించారు. 1990 అక్టోబర్ 10న న్యూ ఢిల్లీలో జన్మించింది రకుల్. 2009లో 18 సంవత్సరాల వయస్సులో మోడలింగ్ స్టార్ట్ చేసింది రకుల్. అలాగే 25 డిసెంబర్, 1984న కోల్‌కతాలో జన్మించిన జాకీ సింధీ కుటుంబానికి చెందినవారు.
లైఫ్ స్టైల్ ఆసియాలో నివేదించిన ప్రకారం..రకుల్ ఒక్కో సినిమాకు రూ. 3 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలాగే బ్రాండ్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ లలో పాల్గొంది. జూబ్లీహిల్స్ లో 16000 చదరపు అడుగులలో 3BHK ఇంటిని కలిగి ఉంది. అలాగే ఢిల్లీ, వైజాగ్, ముంబై ప్రాంతాల్లో కొన్ని ఫ్లాట్స్ కలిగి ఉంది. రకుల్ వద్ద రూ. 1 కోటి విలువైన Mercedes Benz GLE, రూ. 70 లక్షలు విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ. 75 లక్షలు విలువైన BMW 520D, రూ. 35 లక్షలు విలువైన ఆడి క్యూ3. రూ. 2.96 కోట్లు Mercedes-Maybach GLS600 కార్లు ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు సుమారుగా రూ. 84 కోట్లు కలిగి ఉన్నారు. రకుల్ నికర విలువ రూ. 49 కోట్లు, జాకీ నికర విలువ రూ. 35 కోట్లు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




