
దాదాపు ఐదు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేని ఓ సాధారణ బస్ కండక్టర్.. తనదైన నటనతో ఇండస్ట్రీలో ముద్రవేశారు. ఇటీవలే జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రజినీ.. ఇప్పుడు కూలీ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. అయితే మీకు తెలుసా.. ? రజినీకాంత్ ముగ్గురు హీరోయిన్లకు ఒకేసారి భర్తగా, కొడుకుగా నటించాడని… ఇంతకీ ఆ ముగ్గురు హీరోయిన్లు ఎవరు.. ? ఏఏ సినిమాల్లో కలిసి నటించారో తెలుసుకుందామా.
డైరెక్టర్ కె. బాలచందర్ దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ చిత్రంలో రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీవిధ్య కలిసి నటించారు. ఈ చిత్రంలో శ్రీవిద్య రజినీకి జోడిగా నటించింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి 1991లో డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన దళపతి చిత్రంలో నటించారు. ఇందులో రజినీకి తల్లిగా నటించింది శ్రీవిద్య. అలా ఆమెకు భర్తగా, కొడుకుగా నటించారు రజినీ.
అలాగే సీనియర్ హీరోయిన్లలో సుజాత ఒకరు. ఆమె కె. బాలచందర్ తెరకెక్కించిన అవర్గల్ చిత్రంలో సుజాత, కమల్, రజినీ ముగ్గురు నటించారు. ఇందులో రజినీ భార్యగా సుజాత నటించింది. కొన్నాళ్లకు 2002లో రజినీ నిర్మించిన బాబా చిత్రంలో సుజాత రజినీకి తల్లిగా నటించింది. అలా సుజాతకు భర్తగా, కొడుకుగా నటించారు రజినీ.
వీరిద్దరు మాత్రమే కాకుండా.. సీనియర్ హీరోయిన్ లక్ష్మికి సైతం రజినీ భర్తగా, కొడుకుగా నటించారు. నెట్రికన్ సినిమాలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. అందులో లక్ష్మి తన తండ్రి రజినీకాంత్ భార్య పాత్రను పోషించారు. ఎస్.పి.ముత్తురామన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ దిప్వాత్రాభినయం చేయగా.. ఇందులో రజినీకి భార్యగా కనిపించారు లక్ష్మి. ఆ తర్వాత 1999లో వచ్చిన నరసింహ సినిమాలో రజినీకి తల్లిగా నటించారు లక్ష్మి.
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..