- Telugu News Photo Gallery Cinema photos Don't miss this interesting web series, the name of this series is sampurna
OTT Movie : శోభనం రోజే భార్యకు చుక్కలు చూపించిన సైకో భర్త.. ఊహించని ట్విస్ట్‌లు
ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Updated on: Jul 11, 2025 | 1:47 PM

ప్రతి శుక్రవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పదుల సంఖ్యలో సినిమాలు విడుదలై అభిమానులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీల్లో సినిమాలు చూడటానికి ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి.

థియేటర్స్ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలోనూ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఓటీటీ లవర్స్‌ను ఆకట్టుకునేలా చాలా జోనర్స్‌లో సినిమాలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్‌లో రిలీజ్ అయిన నెలరోజులకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.

ఇప్పుడు ఓ ఆసక్తికర సిరీస్ ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది. గృహ హింస, స్త్రీల హక్కులు, సామాజిక న్యాయంపై నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సినిమాలో పెళ్ళైన ఓ మహిళ తన భర్త నుంచి ఎదుర్కునే ఇబ్బందిని చూపించారు. ఈ సిరీస్ లో నందిని అనే యువతి పెళ్లి చేసుకొని అత్తగారి ఇంట్లో అడుగుపెడుతుంది. అయితే మొదటి రాత్రి నుంచే ఆమె భర్త ఆమెపై దౌర్జన్యం చేస్తాడు.

దాంతో ఆమె మానసికంగా క్షోభ అనుభవిస్తూ ఉంటుంది. భర్త సైకోల ప్రవర్తిస్తున్నాడు అని అత్త మామలకు చెప్పుకోలేకపోతుంది నందిని. దాంతో ఆమె తోటి కోడలైన సంపూర్ణ అనే మరో యువతి అండతో న్యాయపోరాటానికి దిగుతుంది. దాంతో ఈ సిరీస్ రసవత్తరంగా మారుతుంది.

ఇది ఒక బెంగాలీ సిరీస్.. దీని పేరు సంపూర్ణ.. IMDb రేటింగ్ 6.8/10 సొంతం చేసుకుంది ఈ సిరీస్. ఈ సిరీస్ సోహిని సర్కార్, రజనందిని పాల్, లబోని సర్కార్, అనుభవ్ కంజిలాల్, ప్రాంతిక్ బెనర్జీ, రజత్ గంగూలీ ప్రధాన పాత్రలో నటించారు. బెంగాలీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ హోయిచోయ్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.




